Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Water Metro: ఇది- నీటిపై ప్రయాణించే మెట్రో: ఛార్జీ, మంత్లీ పాస్ వివరాలివే..

తిరువనంతపురం: ఇప్పటివరకు పట్టాలపై పరుగులు పెట్టే మెట్రో రైళ్లను మాత్రమే చూశాం. హైదరాబాద్ సహా దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వాహనాల రద్దీని నియంత్రించడం, రాకపోకల్లో సమాయాభావాన్ని తగ్గించడం, కాలుష్యం, కర్బన్ ఉద్గారాలను అదుపులో పెట్టడం.. వంటి అనేక కారణాలతో మెట్రో రైలు వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.

తాజాగా- మరో సరికొత్త మెట్రో వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇది- నీటిపై నడించే మెట్రో సర్వీస్. ఇలాంటిదొకటి అందుబాటులోకి రావడం దేశంలోనే తొలిసారి. ఈ తరహా సరికొత్త మెట్రోకు కేరళ శ్రీకారం చుట్టింది. కోచి వాటర్ మెట్రో సర్వీస్‌గా దీనికి పేరు పెట్టారు. మంగళవారం దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రారంభించనున్నారు.

 watermetro

దీనికోసం తిరువనంతపురంలో ప్రత్యేక కార్యక్రమాన్ని కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ వాటర్ మెట్రో సర్వీస్ వల్ల కోచి రీజియన్‌లో పర్యాటక రంగానికి మరింత ఊపు లభిస్తుందని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని గ్లింప్సెస్‌ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీన్ని మలయాళీల డ్రీమ్ ప్రాజెక్ట్‌గా అభివర్ణించారాయన.

ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం 1,136.83 కోట్ల రూపాయలను వ్యయం చేసినట్లు వివరించారు. కోచి రీజియన్ పరిధిలోని 10 దీవులను కలుపుతూ ఈ వాటర్ మెట్రో సర్వీస్ రాకపోకలు సాగిస్తుందని తెలిపారు. 78 ఎలక్ట్రిక్ బోట్లు, 38 టెర్మనల్స్‌ను దీనికోసం నిర్మించినట్లు పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం- కేఎఫ్‌డబ్ల్యూ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాయి. కేఎఫ్‌డబ్ల్యూ అనేది జర్మనీకి చెందిన ఫండింగ్ కంపెనీ.

 watermetro

దశలవారీగా వాటర్ మెట్రో సర్వీసుల సంఖ్యను పెంచుతామని పినరయి విజయన్ చెప్పారు. హైకోర్ట్ జంక్షన్-వైపీన్, వైటిలా- కక్కనాడ్ మార్గాల్లో ఈ సర్వీస్ అందుబాటులోకి రానుంది. హైకోర్ట్ జంక్షన్- వైపీన్ మార్గంలో 20 రూపాయల మేర ఛార్జీని నిర్ధారించారు. వైట్టిలా- కక్కనాడ్ రూట్‌లో 30 రూపాయల మేర ఛార్జీని వసూలు చేస్తారు. పాసుల సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది కేరళ ప్రభుత్వం.

watermet

వీక్లీ పాస్‌- 180 రూపాయలు, మంత్లీ పాస్- 600 రూపాయలు, మూడు నెలల పాస్- 1,500 రూపాయలు. వీక్లీ పాస్‌లో 12, మంత్లీ పాస్‌లో 50, మూడు నెలల పాస్ మీద 150 ట్రిప్పులు రాకపోకలు సాగించే వీలు ఉంది ప్రయాణికులకు. కోచి రీజియన్‌ను వెనిస్ సిటీతో పోల్చుతుంటారు. పాయలుగా చీలిఉంటుందక్కడి ప్రాంతం మొత్తం. అందుకే- వాటర్ మెట్రో సర్వీస్‌ను కేరళ ప్రభుత్వం డిజైన్ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+