స్వచ్ఛమైన ఆలోచన: ఎలక్టోరల్ బాండ్ల విధానంపై ప్రధాని మోడీ, ఇక పెద్ద నిర్ణయాలే

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్టోరల్ బాండ్ల విధానం రద్దుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు స్పష్టమైన మార్గం ఏర్పడిందన్నారు. దీనిపై నిజాయితీగా ఆలోచిస్తే.. వీటి రద్దుపై ప్రతి ఒక్కరూ బాధ పడతారన్నారు. జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ కీలక అంశాలపై మాట్లాడారు.

ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు నగదు ఖర్చు చేస్తాయన్నారు ప్రధాని మోడీ. ఈ క్రమంలోనే నల్లధనాన్ని అరికట్టేందుకు తన మనసుకు వచ్చిన స్వచ్ఛమైన ఆలోచనే ఎలక్టోరల్ బాండ్లు అని ప్రధాని తెలిపారు. నల్లధనం నిర్మూలన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇదే సరైన మార్గం అని తాను ఎన్నడూ చెప్పలేదని ప్రధాని మోడీ తెలిపారు. ఈ పథకం ద్వారా బీజేపీకే ఎక్కువ ప్రయోజనం చేకూరిందని ప్రతిపక్షాలు ఆరోపించడంపై ప్రధాని మోడీ మండిపడ్డారు.

PM Modi s Views On Electoral Bonds Opposition Criticism

'ఎలక్టోరల్ బాండ్లు లేకపోతే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో? ఎవరు? ఎలా ఇచ్చారు? అనే విషయాలు తెలుసుకునే అధికారం ఉండేది కాదు. ఇది ఎలక్టోరల్ బాండ్​ల విజయగాథ. అందుకే మీకు(ప్రతిపక్షాలకు) డబ్బు దొరుకుతోందని చెప్పారు. బాండ్ల అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి 37% శాతం నిధులు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వస్తే ప్రతిపక్షానికి 63% శాతం వచ్చింది' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

అతిపెద్ద నిర్ణయాలుంటాయి

మరోవైపు, సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలో వస్తే దేశాభివృద్ధి కోసం తమ వద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. అలాగే 2047 నాటికి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి పెట్టుకున్న లక్ష్యాల గురించి మోడీ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. 'నా దగ్గర పెద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పినప్పుడు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరినీ భయపెట్టడానికి లేదా పారిపోవడానికి నిర్ణయాలు తీసుకోను. దేశ అభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటా. నేను చేయాల్సింది చాలా ఉంది' అని మోడీ స్పష్టం చేశారు.

ప్రపంచస్థాయి కంపెనీ భారత్​లో పెట్టుబడులు పెట్టాలనే నేను కోరుకుంటా. ఇక్కడ ఎవరూ పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదు. కానీ ఆ కంపెనీ ఉత్పత్తులు భారతీయుల చేతుల్లోనే తయారు కావాలి. అప్పుడే మన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాస్తవానికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వాస్తవానికి భారత్​‌కు మద్దతుదారు. 2015లో నేను టెస్లా ఫ్యాక్టరీని సందర్శించినప్పుడు ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని మరీ నాతో సమావేశమయ్యారు. తన ఫ్యాక్టరీ మొత్తాన్ని చూపించారు. ఆయన దృక్పథం ఏంటో నాకు అర్థమైందని ప్రధాని మోడీ వెల్లడించారు.

జమిలి ఎన్నికలతో మేలు

ఒకే దేశం ఒకే ఎన్నికలనేది మా నిబద్ధత. మేము పార్లమెంట్‌లో మాట్లాడాం. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక కూడా వచ్చింది. ఒకే దేశం-ఒకే ఎన్నికల పరంగా దేశంలో చాలా మంది తమ సలహాలను కమిటీకి అందించారు. చాలా సానుకూలమైన, వినూత్నమైన సూచనలు వచ్చాయి. మేము ఈ నివేదికను అమలు చేయగలిగితే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది అని మోడీ జమిలి ఎన్నికలపై స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+