రెండు వారాల్లో రెండోసారి భేటీ: బ్రిక్స్‌లో కీలక పరిణామం!
ఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దాదాపు రెండు వారాల వ్యవధిలోనే ఇరు నేతలు భేటీ కావడం ఇది రెండోసారి. పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తరుణంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ చర్చల సందర్భంగా ప్రవాస భారతీయులు, నావికుల భద్రతే ఇండియాకు అత్యంత ప్రాధాన్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభించాలంటే చర్చలు, దౌత్య మార్గమే ఏకైక మార్గమని భారత్ మరోసారి అభిప్రాయపడింది. ఇంధన భద్రత అందరికీ అత్యంత కీలకమని.. సరుకు రవాణా చేసే నౌకలకు సముద్ర మార్గాల్లో రక్షణ, స్వేచ్ఛా ప్రయాణం అందుబాటులో ఉండాలని ప్రధాని కోరారు. సవాలుతో కూడుకున్నపరిస్థితుల్లో కూడా బ్రిక్స్ సమావేశాలకు హాజరైనందుకు ఇరాన్‌కు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.

అంతకు ముందు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ.. అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఆధిపత్యాన్ని ఎదుర్కొనడానికి బ్రిక్స్ వేదిక ఎంతగానో తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక స్థిరత్వానని పెంచడానికి సభ్య దేశాలు తమ జాతీయ కరెన్సీలలోనే వాణిజ్యం సాగించాలని పిలుపునిచ్చారు.
Met President Masoud Pezeshkian in Bishkek. Reiterated our commitment to strengthening India’s long standing friendship with Iran across diverse sectors. We want to expand and diversify our trade basket in the times to come.
— Narendra Modi (@narendramodi) August 31, 2026
We had a discussion on the prevailing situation in… pic.twitter.com/qagQy5o108
సభ్య దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక బంధాలను బలోపేతం చేసుకుంటూ ఉమ్మడి అభివృద్ధికి భారత్-ఇరాన్ భాగస్వామ్యం ఎంతో కీలకమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. అంతర్జాతీయ సంక్షోభాలు, ఇంధన రవాణా సవాళ్ల మధ్య ఢిల్లీలో జరుగుతున్న ఈ బ్రిక్స్ సదస్సు అంతర్జాతీయంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications
