బెంగళూరులో ప్రధాని మోదీ రోడ్ షోతో ఎవరికి ప్లస్ పాయింట్ ?, 2018తో పోల్చితే !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల రోడ్ షో నిర్వహించారు. బెంగళూరు నగరంలో మూడు విడతల్లో 28 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని పలు నియోజక వర్గాలను కవర్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ ఐటీ హబ్ లో మొదటిసారి చరిత్ర సృష్టించారు.
బెంగళూరు సిటీలో మొదటి విడతలో నైస్ రోడ్ జంక్షన్ దగ్గర 4. 5 కిలోమీటర్ల రోడ్ నిర్వహించారు. మే 6వ తేదీన బెంగళూరులో కోణెణకుంటే నుంచి మల్లేశ్వరం 18వ క్రాస్ లోని స్యాంకి ట్యాంక్ వరకు 26. 5 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 18 అసెంబ్లీ నియోజక వర్గాలు కవర్ చేశారు.

మే 7వ తేదీ బెంగళూరులోని తిప్పసంద్రలోని కెంపేగౌడ విగ్రహం దగ్గర నుంచి ఎంజీ రోడ్డులోని ట్రినిటీ సర్కిల్ వరకు 6. 5 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. బెంగళూరు చరిత్రలో ఇంత వరకు ఏ ప్రధాన మంత్రి నిర్వహించని రోడ్ షోలు నిర్వహించిన నరేంద్ర మోదీ బెంగళూరు ఐటీ హబ్ చరిత్రలో నిలిచిపోయారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన మే 10వ తేదీకి మూడు రోజుల ముందు అంటే మే 7వ తేదీన ఆదివారం బెంగళూరులోని తిప్పసంద్రలోని కెంపేగౌడ విగ్రహం దగ్గర రోడ్ షో మొదలుపెట్టారు. తిప్పసంద్ర నుంచి బెమల్ గేట్, ఇందిరా నగర్ 80 అడుగుల రహదారిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో కొనసాగింది.

ఇందిరానగర్ నుంచి ఇఎస్ఐ ఆసుపత్రి రోడ్డు, దొమ్మలూరు 12వ మెయిన్ రోడ్డు, జోగుపాళ్య, చిన్మయి మిషన్ ఆసుపత్రి రోడ్డు, లక్ష్మీపుర, హలసూరు మెయిన్ రోడ్డు (పాత మద్రాసు రోడ్డు) మీదుగా ఎంజీ రోడ్డులోని ట్రినిటీ సర్కిల్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో నిర్వహించడం వలన బెంగళూరులో బీజేపీకి ప్లాస్ పాయింట్ అయ్యింది.
బెంగళూరు సిటీలోని అన్నిఅసెంబ్లీ నియోజక వర్గాలు దాదాపుగా కవర్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో పుణ్యమా అంటూ బెంగళూరులోని 28 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 16 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులో నాలుగు స్థానాల్లో విజయం సాధించిన జేడీఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులో ఒక్క నియోజక వర్గంలో కూడా విజయం సాధించలేకపోయింది. జేడీఎస్ పార్టికి చెందిన రెండు నియోజక వర్గాల్లో బీజేపీ ఒకటి, ఒక నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులోని 28 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో, బీజేపీ 11 స్థానాల్లో విజయం సాధించింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ బెంగళూరులో రెండు నియోజక వర్గాల్లో విజయం సాధించింది. అయితే 2019లో బెంగళూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు, జేడీఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆపరేషన్ కమలా దెబ్బతో బీజేపీలో చేరిపోయారు. మొత్తం మీద బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో పుణ్యమా అంటూ బీజేపీకి కొంచెం కలిసి వచ్చిందని బీజేపీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications