భూ హక్కు పత్రాలపై తీపి కబురు
PM Modi to launch SVAMITVA: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తీపి కబురు వినిపించారు. అర్హులైన లబ్దిదారులకు భూ హక్కు పత్రాలను అందించనున్నారు. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ కార్యక్రమం ఆరంభం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించనున్నారు.
65 లక్షల మందికి..
దేశవ్యాప్తంగా తొలి దశలో 65 లక్షల మందిని భూ హక్కు పత్రాల లబ్దిదారులుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. వారందరికీ ప్రాపర్టీ కార్డులను అందజేస్తారు ప్రధాని మోదీ. గ్రామీణ ప్రాంతాలను ఆర్థిక ప్రగతి వైపు నడిపించడానికి 2020 ఏప్రిల్ 24వ తేదీన కేంద్ర ప్రభుత్వం స్వమిత్వ (సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ ఇన్ విలేజ్ ఏరియాస్) పథకాన్ని ప్రారంభించింది.

డ్రోన్ టెక్నాలజీ..
ఈ పథకం కింద అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో భూముల సర్వే నిర్వహించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, గోవా, ఉత్తరాఖండ్, హర్యానా సహా పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వే పూర్తయింది. మొత్తం 3.17 లక్షల గ్రామాల్లో డ్రోన్ల ద్వారా భూములను మ్యాపింగ్ చేయాలని నిర్దేశించుకుంది.
1.53 లక్షల గ్రామాల్లో మ్యాపింగ్ పూర్తి..
ఈ క్రమంలో ఇప్పటివరకు 1.53 లక్షల గ్రామాల్లో మ్యాపింగ్ పూర్తయింది. అర్హులైన లబ్దిదారులు మొత్తంగా 2.25 కోట్ల మంది ఉన్నట్లు నిర్ధారించింది. తొలి విడతలో భాగంగా ఇందులో 65 లక్షల మందికి ప్రధాని మోదీ ఈ మధ్యాహ్నం భూ హక్కు పత్రాల (ప్రాపర్టీ కార్డులు)ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందజేయనున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఏపీలో గతంలో..
గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్లు, డిజిటల్ పద్ధతుల్లో భూముల సర్వే చేయడం, వాటిని మ్యాపింగ్ చేయడం అనేది ఏపీలోనూ గతంలో కొనసాగిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించారు.
రీసర్వే చేసిన రాష్ట్రాలకు భారీగా ప్రోత్సాహకాలు..
అటు కేంద్రం కూడా భూములను రీసర్వే చేసిన రాష్ట్రాలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ పొందుపరిచింది. ఏకంగా 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలను ఇస్తామంటూ అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా ప్రకటించారు.
రాష్ట్రాలకు అదనపు నిధులు..
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో భూ సంబంధిత సంస్కరణలను చేపట్టిన రాష్ట్రాలకు అదనపు నిధులను ఇస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని అన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో భూముల సమగ్ర రీసర్వే పూర్తి చేయడానికి ప్రోత్సాహకాలను సైతం ఇస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు.
భూ సంస్కరణలు..
భూ సంస్కరణలు, భూ ఆధార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లానింగ్, ల్యాండ్ మేనేజ్‌మెంట్‌లలను చేపట్టే రాష్ట్రాలకు మాత్రమే ఈ ప్రోత్సాహకాలు గానీ, 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు గానీ అందుతాయని అన్నారు.
కాడాస్ట్రల్ మ్యాప్‌ల డిజిటలైజేషన్
అన్ని భూములకు యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ULPIN) లేదా భూ-ఆధార్ అసైన్‌మెంట్, కాడాస్ట్రల్ మ్యాప్‌ల డిజిటలైజేషన్, ప్రస్తుత యాజమాన్యం ప్రకారం మ్యాప్ సబ్-డివిజన్‌ల సర్వే, ల్యాండ్ రిజిస్ట్రీ అండ్ లింక్.. వంటివి గ్రామీణ భూ సంబంధిత చర్యలలో ఉంటాయని సీతారామన్ వివరించారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications