పీఎంకే నిరసనలో అపశృతి: రైలుపైకెక్కిన యువకుడు మృతి(వీడియో)
Recommended Video

చెన్నై: కావేరీ వాటర్ బోర్డు కోసం తమిళనాడులో పీఎంకే బుధవారం తలపెట్టిన రైల్ రోకోలో అపశ్రుతి చోటు చేసుకుంది. తిండివనంలో రైల్ రోకో చేస్తూ ఇద్దరు వ్యక్తులు రైల్ పైకి ఎక్కారు.
రైలుపైకి ఎక్కినినాదాలు చేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఓ యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతి చెందిన యువకుడిని పీఎంకే కార్యకర్త రంజిత్‌గా గుర్తించారు.

కాగా, రైలుపై కెక్కిన మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. పీఎంకే కార్యకర్తలు నిరసనల్లో భాగంగా రోడ్లపై నిరసనలు చేపట్టారు. రైల్వే స్టేషన్లలో ఆందోళనలను నిర్వహించి, పలు రైళ్లను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది.
పలు చోట్ల ఆందోళన చేస్తున్న పీఎంకే కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పీఎంకే కార్యకర్త మృతి పట్ల పీఎంకే నేతలతోపాటు ఇతర పార్టీల నేతలు కూడా సంతాపం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా కావేరి బోర్డు ఏర్పాటు కోసం తమిళనాడులో అన్ని పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications