ఆపరేషన్ కమల, బీజేపీలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, బళ్లారి దెబ్బకు కర్ణాటక ప్రభుత్వానికి !

బెంగళూరు: కర్ణాటకలోని విజయనగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ ను రిసార్టులో చితకబాదిన కంప్లీ ఎమ్మెల్యే గణేష్ ను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. కంప్లీ ఎమ్మెల్యే గణేష్ బీజేపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి జరిగిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టారు. జనవరి 18వ తేదీ జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు.

Police case: Karnataka kampli Congress MLA JN Ganesh may join BJP

ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు కంప్లీ ఎమ్మెల్యే గణేష్ ను బుట్టలో వేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని సమాచారం. ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి చేశారని కంప్లీ ఎమ్మెల్యే గణేష్ మీద బిడిది పోలీసులు కేసు నమోదు చేశారు.

హత్యాయత్నం కేసు నమోదు కావడంతో కంప్లీ ఎమ్మెల్యే గణేష్ మాయం అయ్యారు. ఎమ్మెల్యే గణేష్ ను పట్టుకోవడానికి బిడిది పోలీసులు గాలిస్తున్నారు. ఆపరేషన్ కమలను బీజేపీ వదిలిపెట్టడంలేదు. ఇద్దరు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశానికి హాజరుకాని నలుగురు ఎమ్మెల్యేలు, కంప్లీ ఎమ్మెల్యే గణేష్ తో పాటు మొత్తం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని తెలిసింది.

సిద్దగంగా మఠాధిపతి శ్రీ శివకుమారస్వామీజీ మరణించడంతో వచ్చే వారం నుంచి ఆపరేషన్ కమల మళ్లీ మొదలు పెట్టాలని బీజేపీ నాయకులు నిర్ణయించారని తెలిసింది. మొత్తం మీద కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ నాయకులు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+