గోవాలో అక్రమంగా నైజీరియన్లు: హైదరాబాద్ లింక్

కొంత మంది నైజీరియన్లు సరైన వీసా లేకుండా లేదా పోర్జరీ స్టాంపుతో గల వీసా పొడగింపులతో ఉంటున్నట్లు తేలింది. హైదరాబాద్ విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఎఫ్ఆర్ఆర్ఓ) స్టాంపును ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
స్పెషల్ లేజర్ లైట్ సహాయంతో పోలీసులు నైజీరియన్ల నకిలీ వీసా పొడగింపు స్టాంపులను గుర్తించారు. స్పెషల్ లేజర్ లైట్ నకిలీ విసా పొడగింపు స్టాంపులను, నకిలీ విదేశీ కరెన్సీని గుర్తిస్తుంది. మోసం చేశాడనే ఆరోపణపై నైజీరియా జాతీయుడు ఒబిన్నా డేవిడ్ ఒకుమాపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన నకిలీ వీసా పొడగింపు స్టాంపును వాడుతూ అతను బార్డేజ్ తాలూకాలోని అస్సాగావ్‌లో ఉంటున్నాడు.
హైదరాబాద్ ఏజెంట్ ద్వారా కొంత మంది నైజీరియన్లు ఫోర్జరీ చేసిన వీసా పొడగింపులను వాడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఏజెంట్ ఒక్కొక్కరి నుంచి అందుకు 15 వేల రూపాయలు తీసుకున్నట్లు కూడా వార్తాకథనాలను బట్టి తెలుస్తోంది.
అక్టోబర్ 30, 31 తేదీల మధ్య రాత్రి ఓ నైజీరియన్ హత్య నేపథ్యంలో కొంత మంది నైజీరియన్లు పోర్వోరిమ్ వద్ద అక్టోబర్ 31వ తేదీన 17వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దాంతో గోవాలో అక్రమంగా నివసిస్తున్న నైజీరియన్లను గుర్తించడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications