Police: ట్రెజరీలో సర్వీసు తుపాకితో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య, ఏం జరిగిదంటే ? !
బెంగళూరు/గదగ్: విధినిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కుటుంబ సమస్యలు, వర్క్ టెన్షన్ తో ట్రెజరీలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూడటంతో సాటి పోలీసులు సైతం హడలిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగం
కర్ణాటకలోని గదగ్ లో కిరణ్ కుమార్ (45) హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. గదగ్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో కిరణ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే కిరణ్ కుమార్ విధులకు హాజరౌతున్నాడు. ట్రెజరీ దగ్గర కాపలా ఉండటానికి పోలీసు శాఖ కిరణ్ కుమార్ చేతికి 303 తుపాకి ఇచ్చింది.

జిల్లా ట్రెజరీలో డ్యూటీ
బుధవారం కిరణ్ కుమార్ గదగ్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో విధులకు వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో కిరణ్ కుమార్ అక్కడ డ్యూటీ చేస్తున్న విషయం ట్రెజరీ సిబ్బంది చూశారు. తరువాత కిరణ్ కుమార్ ను విధుల నుంచి రిలీవ్ చేసి డ్యూటీలో జాయిన్ కావడానికి సాటి పోలీసు గదగ్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలోకి వెళ్లాడు.

సర్వీసు తుపాకితో ఆత్మహత్య
ఆ సందర్బంలో జిల్లా ట్రెజరీ కార్యాలయం తలుపులు మొత్తం లోపల నుంచి మూసివేసి ఉండటం, కిరణ్ కుమార్ కనపడకపోవడంతో సాటి పోలీసు పై అధికారుకు సమాచారం ఇచ్చారు. పోలీసు అధికారులు వెళ్లి ట్రెజరీ తలుపులు పగలగొట్టి చూడగా కిరణ్ కుమార్ అతని సర్వీసు తుపాకితో గొంతులో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూసింది.

ఫ్యామిలీ సమస్యలు, వర్క్ టెన్షన్ తో ?
కుటుంబ సమస్యలు, వర్క్ టెన్షన్ తో ట్రెజరీలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూడటంతో సాటి పోలీసులు సైతం హడలిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ ఆత్మహత్య చేసుకునే సమయంలో డెత్ నోట్ రాశాడని, డెత్ నోట్ ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామని సాటి పోలీసులు అంటున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications