వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుకూలంగా ఉండేవాళ్లను నియమించుకున్నారా?: యడ్డీ మార్పులతో కాంగ్రెస్, జేడీఎస్ ఆందోళన

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సీఎం పదవి చేపట్టారో లేదో పలు కీలక మార్పులు చేపట్టారు యడ్యూరప్ప. ఐపీఎస్ బదిలీలతో పాటు పోలీస్ వ్యవస్థలోనూ తమకు అనుకూలురైన వాళ్లను కీలక స్థానాల్లోకి తీసుకొచ్చారు. అలాగే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్న రిసార్టుల వద్ద నుంచి పోలీస్ బందోబస్తు తొలగించారు.

యడ్యూరప్ప ఆదేశాలతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్న మైసూరు రోడ్డులోని ఈగల్‌టన్‌ రిసార్ట్‌తో పాటు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్న శాంగ్రిల హోటల్‌ వద్ద బందోబస్తును అధికారులు ఎత్తివేశారు. కొందరు ఎస్పీలను బదిలీలకు సైతం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

అనుకూలంగా ఉండేవాళ్లను..:

అనుకూలంగా ఉండేవాళ్లను..:


తమకు అనుకూలంగా వ్యవహరించే పలువురు అధికారులను కీలక స్థానాల్లో నియమించుకున్నారని ప్రచారం జరుగుతోంది. రైల్వేలో ఏడీజీపీగా ఉన్న అమర్‌కుమార్‌ పాండేను ఇంటలిజెన్స్ విభాగానికి తీసుకొచ్చారు. సౌత్ జోన్ డీఐజీ, నార్త్ డీఐజీలను కూడా బీజేపీకి అనుకూలంగా ఉండేవాళ్లను నియమించుకున్నారని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి.

కార్యకర్తలతో కాపలా:

కార్యకర్తలతో కాపలా:

రామనగర జిల్లా ఎస్పీని కూడా మార్చింది ప్రభుత్వం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉంచిన ఈగల్ టన్ రిసార్టు ఈ ఎస్పీ కార్యాలయం పరిధిలోకే వస్తుంది. రిసార్టు వద్ద బందోబస్తు తొలగించిన నేపథ్యంలో.. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలతో కాంగ్రెస్ ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకుంది. రామనగర పరిధిలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉండటంతో కార్యకర్తలను రప్పించి రిసార్టు వద్ద కాపలా ఉంచింది.

బీజేపీలోనూ ఆందోళన:

బీజేపీలోనూ ఆందోళన:

యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంటూ బుధవారం అర్థరాత్రి తర్వాత కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణస్వీకారంపై స్టే కుదరదని చెప్పినప్పటికీ.. బలనిరూపణ గడువు విషయంలో మాత్రం శుక్రవారం సుప్రీం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ సుప్రీం బలనిరూపణ గడువును 15రోజుల నుంచి కుదిస్తే ఎలా? అన్న ఆందోళన బీజేపీలో మొదలైంది. అందుకే యడ్యూరప్ప తనకు అనుకూలురైన అధికారులను కీలక స్థానాల్లోకి తీసుకొచ్చినట్టు చెబుతున్నారు.

కొచ్చికి తరలిస్తున్నారా?:

కొచ్చికి తరలిస్తున్నారా?:

మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ లను కూడా తీవ్ర ఆందోళన వెంటాడుతోంది. బీజేపీ ఎక్కడ తమ ఎమ్మెల్యేలను లాక్కుంటుందోనన్న భయంతో వారిని బెంగళూరు నుంచి తరలించే యోచనలో ఉన్నాయి రెండు పార్టీలు. కేరళలోని కొచ్చి ప్రాంతంలో ఉన్న క్రౌన్ ప్లాజా రిసార్టుకు రెండు పార్టీల ఎమ్మెల్యేలను తరలిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ హోటల్లో 125గదులను కూడా బుక్ చేసినట్టు చెబుతున్నారు.

బీజేపీ ప్రలోభాల పర్వం: కాంగ్రెస్ రామలింగారెడ్డి

ఈగల్ టన్ రిసార్టు నుంచి పోలీసు బందోబస్తును తొలగించగానే బీజేపీ నేతలు లోపలికి ప్రవేశించారని కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి అన్నారు. డబ్బుతో వారిని ప్రలోభ పెడుతున్నారని, బీజేపీ నేతల నుంచి వారికి ఫోన్లు వస్తూనే ఉన్నాయని అన్నారు.

English summary
The day BS Yeddyurappa took charge as the Chief Minister of Karnataka for the third time, he withdrew police cover for Eagleton resort, where the Congress MLAs are staying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X