స్టేషన్‌లోనే 'మందు దుకాణం': ఫుల్లుగా తాగి చిందేసిన పోలీసులు..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నలుగురికి ఆదర్శంగా.. బాధ్యాతయుతంగా మెలగాల్సిన పోలీసులే ఈమధ్య గాడి తప్పుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లోనే తాగి చిందులేసిన ఘటనలు.. ఆపై రోడ్ల మీద కూడా హల్ చల్ చేసిన సంఘటనలు చాలానే చూశాం.

ఇదే తరహాలో మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లోను ఒక ఘటన చోటు చేసుకుంది. హోలీ వేడుకల్లో మునిగిపోయిన అక్కడి పోలీసులు ఎక్కడున్నామన్న సంగతి కూడా మరిచిపోయారు. ఏకంగా పోలీసు స్టేషన్ లోపలే మందు బాగోతం మొదలుపెట్టారు. బీర్ బాటిల్స్ తో హల్ చల్ చేస్తూ.. స్టేషన్ ప్రాంగణంలోనే తాగి తంథనాలాడారు.

అయితే దీనికి సంబంధించిన వీడియో ఎవరు తీశారో తెలియదు గానీ మొత్తానికి ఈ వీడియో ఇంటర్నెట్ లోకి ఎక్కేసింది. దీంతో వీడియో చూసినవారంతా సదరు పోలీసు అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Public servants, Police officials caught on cam drinking beer inside the police station here on Monday.This act caught on camera by a News agency to expose the the behavior of Policemen.
Please Wait while comments are loading...