Roja: కొడుకుతో పాటు రోజా మేడమ్ కిడ్నాప్, కాళహస్తి సమీపంలో కిడ్నాపర్లు ?, ఏం జరిగింది, డ్రామాలో ?
డేరింగ్ డాషింగ్ గా రాజకీయాల్లోకి వచ్చిన పొలిటికల్ లీడర్ రోజా ఆమె కొడుకుతో పాటు కిడ్నాప్ కు గురైయ్యింది. కిడ్నాప్ తరువాత ఏం జరిగిందో ఏమో తిరుపతి సమీపంలోని కాళహస్తి దగ్గర రోజాతో పాటు ఆమె కుమారుడిని కిడ్నాపర్లు వదిలేసి
చెన్నై/ తిరుపతి/తిరువళ్లూరు: రాజకీయాల్లో స్నేహితులు, అభిమానులు, ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రత్యర్థులు ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత దేనికైనా రెఢీగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చాలా జాగ్రత్తగా, డేరింగ్ డాషింగ్ గా ఉండాలి. అలా రాజకీయాల్లోకి వచ్చిన పొలిటికల్ లీడర్ రోజా ఆమె కొడుకుతో పాటు కిడ్నాప్ కు గురైయ్యింది. కిడ్నాప్ జరిగిన తరువాత ఏం జరిగిందో ఏమో తిరుపతి సమీపంలోని కాళహస్తి దగ్గర పొలిటికల్ లీడర్ రోజాతో పాటు ఆమె కుమారుడిని కిడ్నాపర్లు వదిలేసి వెళ్లడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.

రాజకీయాల్లోకి రోజా
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని కుమ్మిడిపూండి పంచాయతీ యూనియన్ మొదటి వార్డులో కొంతకాలం క్రితం జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్ గా రోజా విజయం సాధించారు. రోజాకు వివాహం అయ్యింది. రోజా ఆమె భర్త పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. రోజా ఏఐఏడీఎంకే (జయలలిత పార్టీ) గుర్తుతో కౌన్సిలర్ గా విజయం సాధించింది. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలో ఉన్న వియం తెలిసిందే.

రోజా మేడమ్ కిడ్నాప్
మంగళవారం పొలిటికల్ లీడర్ రోజా మంగళవారం పల్లవాడ గ్రామంలోని ఆమె ఇంట్లో కొడుకుతో పాటు భోజనం చేస్తున్నారు. అక్కడకు వెళ్లిన గుర్తు తెలియని దుండగులు రోజా, ఆమె కుమారుడు జాకబ్‌లను కత్తితో బెదిరించారు. మర్యాదగా కురు ఎక్కకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. ఆ ఆ సమయంలో రోజా ఎదురు తిరిగిందని తెలిసింది. అయితే ఆ సమయంలో కిడ్నాపర్లు రెచ్చిపోయారు.

ఐపీఎస్ అధికారి ఎంట్రీ
కారులో పొలిటికల్ లీడర్ రోజాతో పాటు ఆమె కొడుకును కిడ్నాప్ చేశారు. రోజా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో తిరువళ్లూరుజిల్లా పోలీసు సూపరింటెండెంట్ చిబాజ్ కళ్యాణ్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి చెందిన కౌన్సిలర్ రోజా, ఆమె కుమారుడు కిడ్నాప్ కావడంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

తమిళనాడు టూ ఆంధ్రా
కిడ్నాప్ కు గురైన పొలిటికల్ లీడర్ రోజా, ఆమె కుమారుడి కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వారి కోసం గాలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు సమీపంలోని శ్రీసిటీ ప్రాంతంలో రోజా కిడ్నాప్‌కు గురైన కారును కొందరు చూశారు. తరువాత స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. ఆంధ్రా పోలీసుల ఎంట్రీతో సిన్ రివర్స్ అయ్యింది

తిరుపతి దగ్గర ఏం పని ?, ఎవరు వాళ్లు
ఆంధ్రా పోలీసులు వెంబడిస్తున్న సమయంలో తిరుపతి సమీపంలోని కాళహస్తి సమీపంలో పొలిటికల్ లీడర్ రోజా, ఆమె కుమారుడిని కారులో నుంచి కిందకు దింపేసిన కిడ్నాపర్లు పరారయ్యారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పోలీసులు రోజా, ఆమె కుమారుడిని రక్షించి ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో కౌన్సిలర్ రోజాను ఎందుకు కిడ్నాప్ చేశారు ?, అసలు కిడ్నాప్ కథ ఏమిటి ? కిడ్నాపర్లు, కిడ్నాప్ చేసిన కారు ఎక్కడ ఉంది ? అని ఆరా తీస్తున్నామని తమిళనాడు పోలీసులు అంటున్నారు. రోజా మేడమ్ డ్రామాలో అసలు ట్విస్ట్ ఏమిటి ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద తమిళనాడు కౌన్సిలర్ రోజా కిడ్నాప్ కథ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పోలీసులకు చుక్కలు చూపించింది.












Click it and Unblock the Notifications