వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాంపు రాజకీయాలు షురూ - ఫలితాలకు ముందే జాగ్రత్తలు : గోవా - ఉత్తరాఖండ్ లో పోటా పోటీగా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముందే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ప్రధానంగా గోవా - ఉత్తరాఖండ్ లో గతంలో జరిగిన రాజకీయ పరిణామల కారణంగా ఇప్పుడు ప్రధాన పార్టీలు జాగ్రత్తలు పడుతున్నాయి. స్పష్టమైన ఆధిక్యత రాదనే అంచనాలతో చిన్న పార్టీలు..స్వతంత్ర అభ్యర్దులు కింగ్ మేకర్లుగా మారుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో గోవాతో పాటుగా ఉత్తరాఖండ్ లో హంగ్ కు ఛాన్స్ ఉందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. దీంతో..ముందుగా కాంగ్రెస్ పార్టీ గోవాలో క్యాంపు రాజకీయాలు ప్రారంభించింది.

గోవా ఉత్తరాఖండ్ లో హంగ్ కు ఛాన్స్

గోవా ఉత్తరాఖండ్ లో హంగ్ కు ఛాన్స్

తమ పార్టీకి చెందిన 37 మంది అభ్యర్ధులను రిసార్టులో ఉంచింది. అదే సమయంలో ఎంజీపీ, టీఎంసీ, ఎన్సీపీ , ఆప్ వంటి పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ముందస్తు వ్యూహాలు అమలు చేస్తోంది. మాజీ సిఎం ప్రమోద్ సావంత్ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలుసుకున్నారు. బీజేపీ తమ రాష్ట్రంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ధీమా ప్రధాని వ్యక్తం చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఆ తరువాత గోవా ఎన్నికల ఇన్ ఛార్జ్ గా వ్యవహరించిన దేవేంద్ర ఫడ్నవీస్‌..గోవా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సదానంద్ షెట్ తో సావంత్ ముంబాయిలో సమావేశమయ్యారు. స్వతంత్ర అభ్యర్ధులతోనూ బీజేపీ టచ్ లో ఉంది. టీఎంసీలో చేరిన వారితో పాటుగా ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన వారితోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు షురూ

కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు షురూ

ఇక, కాంగ్రెస్ నుంచి ధవలికర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఎంజీవీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకుంటుందని చెప్పారు. ఫలితాలు వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బీజేపీ ఎత్తుగడలను గమనిస్తున్న కాంగ్రెస్.. కౌంటింగ్ పూర్తయ్యూ వరకూ తమ అభ్యర్దులను రిసార్ట్ లోనే ఉంచాలని డిసైడ్ అయింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు మాత్రం తాము క్యాంపు రాజకీయాలు చేయటం లేదని.. ప్రతిపక్ష నాయకుడు దిగంబర్ కామత్ పుట్టినరోజు కావడంతో అందరం కలిసి నిర్వహించుకోవాలని కలిసామని వివరించారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకున్నా.. ప్రముఖులు మినహా మిగిలిన వారు పార్టీ వీడారు.

ఉత్తరాఖండ్ లో బీజేపీ అప్రమత్తం

ఉత్తరాఖండ్ లో బీజేపీ అప్రమత్తం


ఇదే విధంగా ఉత్తరాఖండ్ లోనూ హంగ్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి, దీంతో.. బీజేపీ - కాంగ్రెస్ ముఖ్య నేతలు రాష్ట్రంలో మకాం వేసారు. పోలింగ్ తరువాతి పొత్తుల కోసం అనధికార చర్చలు మొదలు పెట్టారు. పార్టీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయను ను బీజేపీ డెహ్రాడున్ కు పంపింది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దీపేందర్ హుడాను డెహ్రాడూన్‌కు పంపింది. 70 మంది సభ్యులు ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కింగ్ మేకర్లు ఎవరనేది ఇప్పుడు అంచనాలు వేస్తున్నారు. స్వతంత్రులు గెలిచే వారిని ముందుగానే తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు బీజేపీ - కాంగ్రెస్ చేస్తున్నాయి. 2017లో గోవా..మణిపూర్ లో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా.. ప్రభుత్వం కొనసాగించటంలో విఫలమయ్యాయి.

Recommended Video

Goa Elections 2022: BJP, Congress వ్యూహాలు TMC, AAP గట్టిపోటీ | Oneindia Telugu
చిన్న పార్టీలు..స్వతంత్రులకు డిమాండ్

చిన్న పార్టీలు..స్వతంత్రులకు డిమాండ్

దీంతో.. ఈ సారి ఉత్తరాఖండ్ లో అటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక, చివరి ఓటు లెక్కిచే వరకూ అప్రమత్తంగా ఉండాలని బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీ నేతలను ఆదేశించారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి దుష్యంత్ కుమార్ గౌతమ్ కూడా ఉత్తరాఖండ్‌లోనే మకాం వేశారు. 2017లో, బీజేపీ 57 సీట్లు, కాంగ్రెస్ 11 ,స్వతంత్రులు ఇద్దరు గెలిచారు. ఈసారి, బీఎస్పీ, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ , ఉత్తరాఖండ్ జన్ ఏక్తా పార్టీ , స్వతంత్ర అభ్యర్థులు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన నెంబర్ గేమ్ లో కింగ్ మేకర్లు అయ్యే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి.

English summary
After the exit polls of the five states, the political parties in Goa and Uttarakhand have begun their resort politics as the polls have estimated a hung.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X