వినోద కార్యక్రమమే: మోడీ హవా సర్వేలపై నితీష్‌కుమార్

ఈ నేపథ్యంలో ఆయన సర్వేలపై స్పందించారు. ఎన్డీయే కూటమి ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందనే సర్వేల ఫలితాలను ఆయన తోసిపుచ్చారు. అటువంటి సర్వేలు కాలక్షేప, వినోద కార్యక్రమాలు తప్ప మరొకటి కాదన్నారు.
ఇటువంటి సర్వేలు అన్ని జాతి మనోభీష్టం తమకు అనుకూలంగా ఉందంటూ కొందరు చేసుకునే తప్పుడు ప్రచారాలు అని దుయ్యబట్టారు.
2005, 2010 సంవత్సరాలలో బీహార్ ఎన్నికలు జరిగినప్పుడు రెండుసార్లు త్రిశంకు సభలే ఏర్పడతాయని సర్వేలు చెప్పాయని అయితే సర్వేలు తప్పని తర్వాత వచ్చిన ఫలితాలు రుజువు చేశాయన్నారు. త్వరలో వచ్చే ఎన్నికల ఫలితాలు ఇప్పుడు చెప్పిన సర్వేలు తప్పని చెబుతాయని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications