సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !

రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా కర్ణాటకలో పర్యటించి వసూళ్లు చెయ్యడానికి వచ్చారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. హుబ్బళిలో హత్యకు గురైన నేహా కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వచ్చిన సూర్జేవాలా ఆ ఓదార్పు యాత్ర ముసుగులో కర్ణాటకలో ఎంత వసూలు అయ్యిందని లెక్కలు వేసుకుని వెళ్లారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అరాచకాలు ఎక్కువ అయ్యాయని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. సుర్జేవాలా కర్ణాటక పర్యటన గురించి మాట్లాడిన ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ నుంచి డబ్బులు వసూలు చేసేందుకే ఆయన రాష్ట్రానికి వచ్చారని అన్నారు. కర్ణాటక నుంచి డబ్బులు వసూలు చేసి వేరే రాష్ట్రాల్లో ఎన్నికల కోసం ఖర్చు చేస్తున్నారని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.

Prahlad Joshi accused Congress high command leaders of Jalsa while collecting money in Karnataka

కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులకు ఏటీఎం అయ్యిందని, ఎప్పుడు డబ్బులు అవసరం అయితే అప్పుడు కర్ణాటకకు వచ్చి డబ్బులు తీసుకు వెలుతున్నారని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. హత్యకు గురైన కాలేజ్ అమ్మాయి నేహా తండ్రి నిరంజన్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ అని, కాంగ్రెస్ నాయకుడు అయినా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నేహా కుటుంబానికి మాత్రం న్యాయం జరగలేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.

కేంద్రంలో అధికారంలోకి రావాలంటే 272 ఎంపీ స్థానాలు అవసరం అయిన, ఆ ఎంపీ స్థానాలు వచ్చిన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుందని ప్రహ్లాద్ జోషి అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కేవలం 230 స్థానాల్లో పోటీ చేస్తోందని, ఆ పార్టీ కేంద్రంలో ఎలా అధికారంలోకి వస్తుందని ప్రహ్లాద్ జోసి ప్రశ్నించారు. మోదీ ప్రధాని అయిన తరువాత దేశంలో 12 కోట్ల టాయిలెట్లు కట్టించారని, అన్ని టాయిలెట్లు కట్టించిన తరువాత కాంగ్రెస్ నాయకులు చెంబులు చేతిలో పట్టుకుని వెలుతున్నారని ప్రహ్లాద్ జోషి వ్యంగంగా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+