వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకాష్ రాజ్ vs అక్షయ్ కుమార్: మీ నుంచి ఇది ఊహించలేదు

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన అంశం- గాల్వన్ వ్యాలీ ఘర్షణ. 2020లో లఢక్ సమీపంలో భారత్ చైనా సరిహద్దుల్లో గల గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ప్రాణాంతక దాడులు చోటు చేసుకున్న ప్రదేశం ఇది. ఈ దాడుల్లో భారత్‌కు చెందిన 20 మంది భారత జవాన్లు అమరులు అయ్యారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏకి చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి గానీ- దీన్ని ఎవరూ ధృవీకరించలేదు.

మళ్లీ వార్తల్లో గాల్వన్ వ్యాలీ..

మళ్లీ వార్తల్లో గాల్వన్ వ్యాలీ..

ఇప్పుడు మళ్లీ గాల్వన్ వ్యాలీ వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం లేకపోలేదు. గాల్వన్ వ్యాలీపై బాలీవుడ్ నటి రిచా ఛద్ద చేసిన ఓ చిన్న కామెంట్ ఇప్పుడు దుమారాన్ని రేపుతోన్నాయి. వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నాయి. ఈ విషయంలో చిత్ర పరిశ్రమ కూడా రెండుగా విడిపోయినట్టే కనిపిస్తోంది. బాలీవుడ్- దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీ మధ్య కూడా ఇది అభిప్రాయ భేదాలకు కారణమౌతోంది. పరస్పరం విమర్శలు, ఆరోపణలకు తావిచ్చింది.

రిచా ఛద్దా ఏం చెప్పారు?

గాల్వన్ వ్యాలీపై ఓ చిన్న కామెంట్‌ను రిచా ఛద్దా తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. గాల్వన్ సేస్ హాయ్ అని వ్యాఖ్యానించారు. ఆ కామెంట్ చుట్టూ ఇప్పుడు వివాదం చెలరేగుతోంది. పలువురు నెటిజన్లు ఆమెపై ధ్వజమెత్తుతున్నారు. ఘాటు విమర్శలను సంధిస్తోన్నారు. గాల్వన్ వ్యాలీ అంశం కోట్లాదిమంది భారతీయుల మనోభావాలతో ముడిపడి ఉన్నదని. దీన్ని ఇంత తేలిగ్గా తీసిపడేయడం సరికాదనీ చెబుతున్నారు.

అక్షయ్ కుమార్ సైతం..

అక్షయ్ కుమార్ సైతం..

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సైతం నెటిజన్లతో గొంతు కలిపాడు. రిచా ఛద్దాపై ఘాటు విమర్శలు చేశాడు. ఈ పోస్ట్.. తన భావాలను గాయపరిచిందని వ్యాఖ్యానించాడు. సైనిక బలగాలను మించి మరొకటి లేదని స్పష్టం చేశాడు. దేశ సరిహద్దుల్లో నిత్యం పహారా కాసే సాయుధ బలగాలకు కృతజ్ఞత చూపడానికి మించనదేమీ లేదని పేర్కొన్నాడు. వారి పట్ల కృతజ్ఞతగానే ఉండాలని సూచించాడు. వారు సరిహద్దుల్లో ఉండటం వల్ల తాము సురక్షితంగా జీవిస్తోన్నామని చెప్పాడు అక్షయ్ కుమార్.

ప్రకాష్ రాజ్ నుంచి కౌంటర్..

ప్రకాష్ రాజ్ నుంచి కౌంటర్..

అక్షయ్ కుమార్ చేసిన ఈ కామెంట్స్‌కు దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు. అక్షయ్ కుమార్ నుంచి ఇలాంటి రియాక్షన్‌ను తాను ఊహించలేదని పేర్కొన్నాడు. రిచా ఛద్దా మన దేశానికి చెందిన పౌరురాలేనని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారాయన. దీన్ని అక్షయ్ కుమార్, రిచా ఛద్దాకు ట్యాగ్ చేశారు. మీ దేశం, మా దేశం అనే తేడాలేదని, మనం అందరం ఒక దేశ పౌరులే అనే అర్థం వచ్చేలా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

English summary
Prakash Raj came in support of Richa Chadha, and he even slammed Akshay Kumar for condemning the actress over her recent controversial comment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X