వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ సీక్రెట్: గుమ్నాబీ బాబాని కలిసిన ప్రణబ్ ముఖర్జీ! నేతాజీయేనా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుభాష్ చంద్రబోస్‌గా భావిస్తున్న గుమ్నామి బాబాని ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలిశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. బోస్.. గుమ్నామీ బాబాగా సంచరించారని చాలామంది విశ్వసిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం నాడు ఇది మరో ఆసక్తికర టర్న్ తీసుకుంది. 1980లో నాడు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీని గుమ్నామీ బాబా ఫైజాబాదులో కలిశారని అంటున్నారు.

చంద్రబోస్ 1945లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారని కొందరు, అదేం లేదని ఆయన 1980ల వరకు బతికే ఉన్నారని, గుమ్నామి బాబాగా చలమణి అయ్యారని మరికొందరు వాదిస్తున్న విషయం తెలిసిందే.

ప్రణబ్ ముఖర్జీ, గుమ్నామీ బాబా కలిశారనే ఆసక్తికర కథనం ఆంగ్ల మీడియాలో వస్తోంది. ఇందుకు సంబంధించి 'సహాయి కమిషన'కు రవీంద్ర శుక్లా అనే 57 సంవత్సరాల వ్యక్తి మంగళవారం తెలిపారు.

Pranab Mukherjee

గుప్తార్ ఘాట్లో గుమ్నామి బాబా అంత్యక్రియలు నిర్వహించినప్పుడు ఉన్న 13 మంది వ్యక్తుల్లో రవీంద్ర శుక్లా కూడా ఒకరు.

ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ... '1981-82 సంవత్సరాల మధ్య కాలంలో భగవాన్ జీ (బాబా) నాకు ఒక సూచన చేశారు. బెంగాల్ నుంచి వచ్చిన ఒక జెంటిల్ మెన్‌తో లోకల్ మార్కెట్ వరకు తోడుగా వెళ్లమన్నారు. అయోధ్యకు చెందిన బిర్లా ధర్మశాలలో ఆ బెంగాల్ జెంటిల్‌మెన్ బస చేశారు. నా మోటర్ సైకిల్ పైన ఫైజాబాద్‌లోని చౌక్ ఏరియాకు ఆయన్ని తీసుకువెళ్లాను.

కొన్ని దుస్తులు, డ్రై ఫ్రూట్స్ కొనుకున్నారు. ఆ తర్వాత, ఆయన బస చేసిన చోటుకు వెళ్లాం. ఆయనతో చాలాసేపు గడిపాను. ఆయన ముఖాన్ని నేను ఇప్పటికీ గుర్తు చేసుకోగలను. ఆ రోజు నేను మార్కెట్‌కు తీసుకుని వెళ్లిన వ్యక్తి, కేంద్రమంత్రి పదవులు, ఆ తర్వాత రాష్ట్రపతి అయిన వ్యక్తి ఒకరే అని నేను గుర్తించాను. ఆ వ్యక్తే ప్రణబ్ ముఖర్జీ' అని కమిషన్‌కు తెలియజేశానని రవీంద్ర శుక్లా పేర్కొన్నారు.

బాబా బతికున్నంత వరకూ ఆయన్ని నేనెప్పుడూ చూడలేదని, కానీ ఆయన ఆశీర్వాదం పొందానని, పాద నమస్కారం చేశానని, భగవాన్ జీ గదిలో కూలర్‌ను బాగు చేశానని, మొట్టమొదటిసారి భగవాన్ జీని నేనెప్పుడు చూశానంటే.. ఆయన చనిపోయినప్పుడని చెప్పారు. చంద్రబోస్‌కు చాలా దగ్గర పోలికలు భగవాన్ జీకి ఉండేవని శుక్లా చెప్పినట్లు చెబుతున్నారు.

English summary
The mystery surrounding Gumnami Baba, who many believe was Subhas Chandra Bose, took a curious turn on Tuesday when the Sahai Commission was informed that President Pranab Mukherjee had met him in Faizabad in the 1980s when he was a Union minister in the Congress government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X