ఊహించని ట్విస్ట్.. దేశ రాజకీయాలను మార్చబోయేది ఎవరో తెలుసా?.. ఫోర్బ్స్ లిస్టులో అన్నీ సంచలనాలే..
ఒకప్పుడు లోక్‌సభలో రెండు సీట్లున్న బీజేపీ... ఇవాళ తిరుగులేని శక్తిగా ఎదిగింది. దశాబ్దాలపాటు కొనసాగిన కాంగ్రెస్ ప్రభ క్రమంగా మసగబారింది. అదే క్రమంలో ప్రాంతీయ పార్టీలు హవా బాగా పెరిగిపోయింది. ఓటర్ల తీర్పులు ఇక ముందు కూడా ఇలానే ఉంటాయన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే రాజకీయాలనేవి నిత్యం మారుతూ ఉంటాయి.. మరాలి కూడా. మార్పు ముందు వ్యక్తితో మొదలవుతుంది కదా.. మరి మన దేశంలో ఈ దశాబ్దిలో రాజకీయాలను మార్చబోయే ఆ వ్యక్తులెవరో తెలుసా?

ఆ ఇద్దరు..
ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్.. ‘‘2020లో అత్యంత ప్రభావశీల 20 మంది''పేరుతో ఒక జాబితాను రూపొందించింది. అనూహ్య రీతిలో.. వచ్చే పదేళ్లపాటు ఇండియాలో రాజకీయ గమనాన్ని నిర్దేశించబోతున్న ఆ వ్యక్తుల్లో... ఎన్నికల వ్యూహకర్త, జేడీఎస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్ తోపాటు జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ పేర్లు ఉండటం గమనార్హం.

వాళ్లదే హవా..
ఎన్నికల వ్యూహరచనలో సరికొత్త ఐడియాలు ప్రవేశపెట్టి, ప్రచారంలో కొత్త ఒరవడిని క్రియేట్ చేసిన ప్రశాంత్ కిషోర్ కు దేశంలోని దాదాపు అన్ని పార్టీలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిసి పనిచేసిన అనుభవముంది. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతుండటం కూడా ఆయనకు కలిసొస్తుందని ఫోర్బ్స్ పేర్కొంది. దేశద్రోహం లాంటి పెద్ద కేసును ఎదుర్కొన్న కన్హయ్య కుమార్.. 2019 ఎన్నికల్లో తలపడి ఓడిపోయినప్పటికీ.. గణనీయంగా ఓట్లను రాబట్టుకోగలిగాడని, కెరీర్ ప్రారంభంలో ఏ నేతకైనా ఇలాంటి ఇబ్బందులు తప్పవని, రాబోయే రోజుల్లో అతని ప్రభావం ఎక్కువగానే ఉండబోతోందని ఫోర్బ్స్ అంచనా వేసింది.

ఇతర డైనమిక్ లీడర్లు..
‘‘2020లో అత్యంత ప్రభావశీల 20 మంది'' జాబితాలో హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, గోద్రేజ్ కుటుంబం, ‘మిషెలిన్ స్టార్' దక్కించుకున్న తొలి భారతీయురాలు గరిమా అరోరా తదితరులున్నారు. లిస్టులో టాప్ ప్లేసులో నిలిచిన ప్రశాంత్ కిషోర్, కన్హయ్య కుమార్‌లు ఇద్దరూ బిహార్ కు చెందినవారే కావడం గమనార్హం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications