అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్ర‌శాంత్ కిషోర్ డ‌బ్బులు బాగానే సంపాదించాడే!!

|
Google Oneindia TeluguNews

ఆర్థికంగా అత్యంత ధ‌న‌వంతమైన రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌శాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్ లో జ‌న‌సురాజ్ పేరుతో పాద‌యాత్ర ప్రారంభించారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ప్రారంభ‌మైన ఈ యాత్ర 18నెల‌ల‌కు పైగా కొన‌సాగ‌నుంది. బీహార్లోని ప్ర‌జ‌ల‌కు ఏం కావాలి? వారిని అభివృద్ధి ప‌థంవైపు న‌డిపించాలంటే ఏం చేయాలి? స‌రికొత్త రాజ‌కీయాన్ని వారికి ఎలా ప‌రిచయం చేయాలి? అనే ప్ర‌శ్న‌ల‌కు కూడా పీకే త‌న యాత్ర‌లో స‌మాధానం తెలుసుకోబోతున్నారు.

ఒక్కరోజే రూ.25 కోట్ల ఖర్చు?

ఒక్కరోజే రూ.25 కోట్ల ఖర్చు?


ఈ యాత్ర‌కు భారీగా ఖ‌ర్చ‌వుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. పాద‌యాత్ర ప్రారంభం రోజు దేశ‌వ్యాప్తంగాకానీ, బీహార్ రాష్ట్ర ప‌రిధిలో, సోష‌ల్ మీడియా ప్ర‌చారానికి దాదాపు రూ.25 కోట్లు ఖ‌ర్చుపెట్టిన‌ట్ల‌గా చెబుతున్నారు. ఒక్క‌రోజే అంత డ‌బ్బు ఖ‌ర్చుపెట్టారంటే పీకే ద‌గ్గ‌ర ఎవ‌రూ ఊహించ‌ని డ‌బ్బులుంటాయ‌నే వ్యాఖ్య‌లు విన‌ప‌డుతున్నాయి. 2014లో మోడీని ప్ర‌ధాన‌మంత్రిగా దేశానికి ప‌రిచయం చేయ‌డానికి, ఆ త‌ర్వాత యూపీలో, త‌మిళ‌నాడులో, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో, ప‌శ్చిమ‌బెంగాల్‌తోపాటు ఇప్పుడు తెలంగాణ‌కు చేస్తున్నారు. అయితే ఆయ‌న టీఆర్ఎస్‌కు స్ట్రాట‌జీలు అందించడంలేద‌ని, ఆయ‌న టీముల‌న్నీ ఏపీకి వెళ్లిపోయాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మొదటిరోజు బోసిపోయిన సభ!

మొదటిరోజు బోసిపోయిన సభ!

పాద‌యాత్ర ప్రారంభం రోజు నిర్వ‌హించిన స‌భ‌కు ప్ర‌జ‌లెవ‌రూ హాజ‌రుకాక‌పోవ‌డంపై వార్త‌లు వ‌చ్చాయికానీ, పీకే ఎంత ఖ‌ర్చుపెడుతున్నారు? అంత సొమ్ము ఎక్క‌డిది? అనే విష‌యాల‌ను మాత్రం ఎవ‌రూ విశ్లేషించ‌లేక‌పోయారు. ప‌త్రిక‌ల్లో మొద‌టి పేజీలో ప్ర‌క‌ట‌న‌లు, టెలివిజ‌న్ల‌లో స్లాట్స్ కొనుగోలు చేయ‌డంతోపాటు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారానికి, త‌న సొంత ఐప్యాక్ మ్యాన్ ప‌వ‌ర్ కూడా తిరుగుతుంది కాబ‌ట్టి వారికి ఖ‌ర్చుల‌న్నీ క‌లిపి యాత్ర మొద‌టిరోజు రూ.25 కోట్లు ఖ‌ర్చు చేసి అన్ని పార్టీల‌ను ఔరా! అనిపించారు.

ప్రస్తుత పార్టీలకు ఏమాత్రం తీసిపోని విధంగా..!

ప్రస్తుత పార్టీలకు ఏమాత్రం తీసిపోని విధంగా..!

స‌మ‌కాలీన రాజ‌కీయ పార్టీల‌కు ఏమాత్రం తీసిపోనిరీతిలో ఆయ‌న పెట్టిన ఖ‌ర్చు చూసి అంద‌రూ ముక్కున వేలేసుకున్నారు. ప్ర‌ధాన పార్టీలు స‌భ‌లు నిర్వ‌హించినా అంత ఖ‌ర్చ‌వ‌దని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రశాంత్ కిషోర్ ఆర్థిక మూలాలను బయటకు లాగాలంటూ నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జనతాదళ్ యూ డిమాండ్ చేస్తోంది. వ్యూహకర్తగా వందల కోట్లరూపాయల్లో ఫీజులు తీసుకునే పీకేపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరగవని, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటంవల్లే ఆయన మీద ఈగ కూడా వాలడంలేదని నితీష్ ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ కూడా దేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా నిలబడ్డారు. ఇదంతా ఐప్యాక్ మహిమే.!!

English summary
Prashant Kishore, who worked as an election strategist for the most financially rich political parties, has now started a padayatra in Bihar under the name of Janasuraj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X