covid-19: కరోనావైరస్ గుర్తిస్తే ఆ ప్రాంతంలో అధికార యంత్రాంగం తీసుకునే చర్యలు ఇవే..
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) నివారణకు మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. విదేశాలకు వెళ్లి తిరిగివచ్చే వారికే కరోనావైరస్ ఎక్కువగా సోకే అవకాశం ఉండటంతో.. దేశంలోని అన్ని అంతర్జాతీయ విమనాశ్రయాల్లో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రాలు, జిల్లాలకు కూడా కరోనా వైరస్ ప్రబలకుండా చర్యలు తీసుకునేందుకు పలు అధికారాలు, పరిధులను ఇవ్వడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగంకు పలు కీలక చర్యలకు ప్రభుత్వం నుంచి అనుమతులున్నాయి.

ఒక వేళ కొవిడ్-19 కేసును ఏదైనా గ్రామం, పట్టణం, నగరం, వార్డు, కాలనీ లాంటి ప్రాంతాల్లో గుర్తించినట్లయితే.. ఆ ప్రాంతాలకు సంబంధించిన జిల్లా యంత్రాంగంకు పలు ప్రత్యేక నిబంధనలను అమలు చేసేందుకు అనుమతి ఉంది. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యల్లో భాగంగానే జిల్లా యంత్రాంగానికి ఈ అధికారం ఉంది.
వాటిలో కీలకమైనవి..
Recommended Video

1. ఆ ప్రాంతంలోకి ఇతరుల రాకపోకలపై ఆంక్షలు విధించడం
2. సంబంధిత ప్రాంతంలోకి ప్రజలు బయటకి వెళ్లడం, రావడంపై ఆంక్షలు
3. పాఠశాలలు, కార్యాలయాల మూసివేత, ప్రజలు గుంపులుగా చేరడంపై నిషేధం విధించడం
4. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించడం
5. కోవిడ్ 19 పాజిటివ్, యాక్టివ్ కేసులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం, నిఘా వేసి ఉంచడం
6. ఆస్పత్రిలోని అసోలేషన్ వార్డుల్లో అనుమానిత కేసులను చేర్చడం
7. ప్రభుత్వ లేదా ప్రైవేటు భవనాన్ని ఐసోలేషన్ వార్డుల కోసం ఉపయోగించుకునే అధికారం..
8. సంబంధిత ప్రాంతంలో అధికార యంత్రాంగాన్ని కేంద్రీకరించడం, నివారణ చర్యలను నిరంతరం పర్యవేక్షించడం
9. కోవిడ్ 19ను అరికట్టేందుకు వైద్యరోగశాఖ ఇచ్చే మార్గదర్శకాలను అమలు చేయడం
15 వరకు వీసాల రద్దు
ఇక మనదేశంలోనూ 62 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. కర్ణాటకలో కరోనా అనుమానిత లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకు వీసాలను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications