వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్యకు ఛాన్స్ లేనట్లే : రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి అభ్యర్ధుల ఫైనల్ : ప్రకటనకు బీజేపీ సిద్దం..!!

|
Google Oneindia TeluguNews

దేశంలో ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకటన వచ్చినా... రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరనేది ఇటు ఎన్డీఏ - అటు యూపీఏ నుంచి స్పష్టత రాలేదు. రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక పైన ఈ రోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. అయితే, ఇక్కడ కాంగ్రెస్ తో కలిసి సమావేశంలో పాల్గొనటం ఇష్టం లేని టీఆర్ఎస్..ఆప్ వంటి పార్టీలు ఈ సమావేశానికి హాజరు కావటం లేదు. ఇప్పటి వరకు ఎన్సీపీ శరద్ పవార్ పేరు రేసులో ఉన్నా.. కాంగ్రెస్ మద్దతిచ్చినా... సంఖ్యా బలం పైన నమ్మకం లేక ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. ఇక, గత ఎన్నికల్లో వెంకయ్య నాయుడ పైన పోటీ చేసిన గాంధీ మనవడు గాపాలక్రిష్ణ గాంధీ పేరు సైతం తెర పైకి వచ్చింది.

నేడే రాష్ట్రపతి అభ్యర్ధి పై క్లారిటీ

నేడే రాష్ట్రపతి అభ్యర్ధి పై క్లారిటీ

అయితే, కాంగ్రెస్ తో జత కట్టటానికి కొన్ని ప్రధాన పార్టీలు ససేమిరా అనటం ఇప్పుడు బీజేపీకి వరంగా మారుతోంది. దీంతో..ఈ రోజు సమావేశం తరువాత బీజేపీ నుంచి రాష్ట్రపతి అభ్యర్ధి పేరు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అందులో రెండు ఆప్షన్లను బీజేపీ ఆలోచన చేస్తున్నట్లుగా విశ్వస నీయ సమాచారం. ఎస్టీ వర్గానికి ఇవ్వాలనుకుంటే ఎస్టీ కమ్ మహిళ.. గవర్నర్ హోదా నిర్వహించిన ద్రౌపది ముర్ము పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, యూపి ఎన్నికల ఫలితాలు.. మారుతున్న సమీకరణాలు..తొలి నుంచి అండగా నిలుస్తున్న వర్గాలు దూరమవతున్నాయనే చర్చ సైతం బీజేపీలో వినిపిస్తోంది. దీంతో..అగ్రవర్ణాలకు చెందిన వారికే అవకాశం దక్కే ఛాన్స్ సైతం ఉందని తాజాగా అందుతున్న సమాచారం.

ఉప రాష్ట్రపతిగా మైనార్టీ నేత

ఉప రాష్ట్రపతిగా మైనార్టీ నేత

అందులోనూ ఈ సారి పశ్చిమ బెంగాల్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి..గుజరాత్ కు చెందిన వ్యక్తి.. మాజీ టీఎంసీ నేత దినేష్ త్రివేది పేరు తెర మీదకు వచ్చింది. దీంతో..ఇప్పటి వరకు ఆప్..టీఆర్ఎస్ కాంగ్రెస్ కు దూరంగా కాగా.. పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తికి ఇవ్వటం ద్వారా టీఎంసీ సైతం తమకే మద్దతిచ్చేలా ఎన్డీఏ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక, ఉప రాష్ట్రపతిగా ప్రస్తుతం పదవిలో ఉన్న వెంకయ్య నాయుడుకు దక్షిణాది కోటా నుంచి మరోసారి రెన్యువల్ దక్కుతుందనే అంచనాలు కొద్ది రోజుల క్రితం వరకు వినిపించాయి. కానీ, ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి మైనార్టీలకు ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయినట్లు విశ్వసనీయ సమాచారం.

వెంకయ్యకు రెన్యువల్ లేనట్లే

వెంకయ్యకు రెన్యువల్ లేనట్లే


అందులో భాగంగా.. బీజేపీలో సుదీర్ఘ కాలం మైనార్టీ నేతగా.. కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న ముక్తార్ అబ్బాస్ నక్వీ ని రాజ్యసభను రెన్యువల్ చేయలేదు. దీంతో..ఉపరాష్ట్రపతిగా ముక్తార్ అబ్బాస్ నక్వీ పేరు ఖరారు కానుందనే ప్రచారం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. కానీ, నక్వీ కాకపోయినా ఉపరాష్ట్రపతి పదవి మాత్రం మైనార్టీ వర్గానికే ఇవ్వటం ఖాయమని తెలుస్తోంది. దీంతో..ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు కు రెన్యువల్ లేదనే భావించాలి. ఈ మొత్తం వ్యవహారం పైన ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

English summary
NDA almost finalise the names for President and Vie presidnet elections, After Mamata meetig may be annouce officially.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X