భారీ యురేనియం అమెరికా హస్తగతం- పకడ్బందీ

ఇరాన్ తో యుద్ధం, కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సంచలనానికి తెర తీసింది. వెనిజులా నుండి భారీగా యురేనియాన్ని తన దేశానికి తరలించింది. రాజధాని కరాకస్ లో ఉన్న యురేనియం ప్లాంట్ మొత్తాన్ని కూడా ఖాళీ చేసింది. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (NNSA) ప్రకటించింది. వెనెజులా రీసెర్చ్ రియాక్టర్ నుండి యురేనియాన్ని విజయవంతంగా తొలగించినట్లు ప్రకటించింది.

ఈ చర్య దక్షిణ అమెరికా, అమెరికా హోమ్ లాండ్ భద్రతకు అణు ప్రమాదాలను తగ్గించడంలో గణనీయమైన పురోగతిని సాధించినట్టయిందని ఎన్ఎన్ఎస్ఏ పేర్కొంది. అమెరికా ఇంధన శాఖలో పాక్షిక స్వయంప్రతిపత్తి సంస్థగా కొనసాగుతోందీ ఏజెన్సీ. యురేనియం వ్యవహారాలన్నింటిని కూడా పర్యవేక్షించేది ఇదే. అందుకే- వెనెజులా నుంచి భారీ ఎత్తున యురేనియాన్ని తొలగించడం, దాన్ని తరలించే కార్యక్రమాలకు స్వయంగా సారథ్యాన్ని వహించింది.

US Removes All Highly Enriched Uranium from Venezuela Reactor Boosting Global Nuclear Security

వెనెజులా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా విదేశాంగ శాఖ సిబ్బంది సమన్వయంతో దీన్ని పూర్తి చేసింది ఎన్ఎన్ఎస్ఏ. దీనిపై ఆ సంస్థ అడ్మినిస్ట్రేటర్ బ్రాండన్ విలియమ్స్ మాట్లాడారు. వెనెజులా నుండి మొత్తం సుసంపన్నమైన యురేనియాన్ని సురక్షితంగా తొలగించగలిగామని, ఈ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు సంభవించలేదని పేర్కొన్నారు. ఏ చిన్న పొరపాటు దొర్లివున్నా అది ప్రమాదానికి దారి తీసేదని వ్యాఖ్యానించారు.

తొలగించిన యురేనియం మొత్తాన్ని కూడా ఓ ప్రత్యేక క్యాప్సుల్ లో ప్యాక్ చేసిన అనంతరం కరాకస్ కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దాన్ని యూకేలోని న్యూక్లియర్ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్ కు చెందిన ప్రత్యేక నౌకలోకి షిఫ్ట్ చేశారు. వెనెజులాలోని ఆర్వీ-1 రియాక్టర్ దశాబ్దాలుగా ఫిజిక్స్, న్యూక్లియర్ రీసెర్చ్ కు కేంద్రబిందువుగా కొనసాగింది. 1991లో రీసెర్చ్ కార్యకలాపాలు స్తంభించిన అనంతంర 20 శాతానికి మించి యురేనియం మిగులు ఇక్కడ ఉండిపోయింది. దీని పరిమాణం 13.5 కిలోలు. బరువు సుమారు 30 పౌండ్లు. ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలో ఉన్న 408 కిలోలతో పోల్చుకుంటే ఇది లెక్కలోకే రాదు. ఓ చిన్న భాగం మాత్రమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+