అయోధ్యలో కఠోర దీక్ష విరమించిన ప్రధాని మోడీ!!
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నేడు అయోధ్య మాత్రమే కాదు భారతదేశమంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగుతోంది. బాలరాముడు కొలువుదీరిన భవ్యనగరి వేడుకవేళ ఊరూరా ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఏ గ్రామం చూసినా... ఏ నోట విన్నా కోదండరామయ్య కబుర్లే.. ఎచ్చట చూసినా శ్రీరాముడి రూపాలే.. ఓ పక్క అంక్షింతలు పంచుతూ శోభాయాత్రలు, మరోపక్క రఘురాముడి చిత్రాలు, చిన్నారుల వేషధారణలతో అనేక ప్రదర్శనలను నిర్వహిస్తూ పులకించిపోతున్నారు.
రామ భజనలు, ప్రత్యేక పూజలు, అన్నదానాలు, నగర సంకీర్తనలు, ప్రసాద వితరణలతో దేశం మొత్తం ఒక పండుగ వాతావరణం చోటు చేసుకుంది. ఇక అయోధ్య రామయ్య కోసం కఠోర దీక్ష ఆచరించి రామ నామ జపంతో జనవరి 12 తేదీ నుండి రాముడిపైనే మనసు లగ్నం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపనతో తన దీక్షను విరమించారు.

అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ దీక్షని పండితులు గోవింద్ దేవ్ గురూజీ మహారాజ్ తీర్థం అందించి దీక్ష విరమింపజేశారు. అనంతరం ప్రధాన నరేంద్ర మోడీ ఆ సాదు పుంగవుని ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోడీ 11 రోజుల క్రితం అనుష్ఠాన దీక్ష చేపట్టి కఠినమైన నియమాలను ఆచరిస్తున్నారు.
ఎముకలు కొరుకుతున్న చలిలో చన్నీళ్ళ స్నానం చేస్తూ, నేలపై నిద్రిస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లను మాత్రమే సేవిస్తూ 11 రోజులుగా కఠోర దీక్షను కొనసాగించారు. దీక్షా సమయంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, యోగా, ధ్యానం, కఠిన తపస్సు వంటివి చేయడం చేశారు.
ఈరోజు అయోధ్యలో రామాలయం సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో కొలువుతీరిన రామ్ లల్లా కు తొలి హారతి ఇచ్చారు రామయ్య పాదాలను తాకి సాష్టాంగ నమస్కారం చేశారు. అలాగే శ్రీరామచంద్రుని ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీకాంత దీక్షితులుకు పాదాభివందనం చేసి ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఆశీస్సులను తీసుకున్నారు. ఇక మహా క్రతువు పూర్తయిన అనంతరం మోడీ దీక్షను విరమించారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications