ప్రజలను అభివృద్దిలో భాగస్వామ్యం చేయడమే ప్రజాస్వామ్యం: మోడీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అభివృద్దిలో ప్రజలను భాగస్వామ్యులను చేయడమే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్ధమన్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ. ప్రజాస్వామ్య బలం ఓట్లకు మాత్రమే పరిమితం కాదన్నారు మోడీ.

దిల్లీలో జరిగిన నానాజీ దేశ్‌ముఖ్‌ శత జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సుపరిపాలన లేదని మోడీ అభిప్రాయపడ్డారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజలు భాగస్వాములు కావడమేనని చెప్పారు మోడీ.

Prime Minister Narendra Modi Pays Tributes to Nanaji Deshmukh, Jaiprakash Narayan

ప్రజాస్వామ్యానికి ఓట్లు ముఖ్యమేనని చెప్పారు. కానీ, ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఒకటే ప్రజాస్వామ్యానికి బలం కాదన్నారాయన.ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం మాత్రం అభివృద్ధిలో ప్రజలను భాగస్వాముల్ని చేయడమేనని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రజలు, ప్రభుత్వం మధ్య నిరంతర చర్చలు అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు.

  Modi's letters to celebrities But Why Modi skipped Pawan? పవన్‌ కు మోడీ షాక్ | Oneindia Telugu

  సరైన సమయంలో చొరవ తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేనే వాటి ఫలాలు లబ్ధిదారులకు చేరతాయన్నారు. పట్టణాలు, నగరాల్లో ఉండే సదుపాయాలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కల్పించాలని.. అప్పుడే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని మోదీ అన్నారు. నానాజీ దేశ్‌ముఖ్‌ సేవలను ప్రధాని కొనియాడారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Prime Minister Narendra Modi on Wednesday paid tributes to political leader Loknayak Jaiprakash Narayan and Sangh Parivar veteran Nanaji Deshmukh on their birth anniversaries.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి