మోదీ నినాదాలతో దద్దరిల్లిన ఐటీ హబ్, బెంగళూరులో బీజేపీ జనసాగరం !
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కర్ణాటకలోని పలు జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి బెంగళూరు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు.
బెంగళూరులోని నైస్ రోడ్డు జంక్షన్ నుంచి సుమ్మనహళ్లి వరకు ఐదు కిలోమీటర్ల పొడవునా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీని చూడటానికి ఆ ప్రాంతంలోని ప్రజలతో పాటు బెంగళూరులోని వివిద ప్రాంతాల నుంచి, బెంగళూరు గ్రామీణ జిల్లా నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలు ఎగబడ్డారు.

ఓపెన్ టాప్ ప్రత్యేక వాహనంలో నరేంద్ర మోదీ రోడ్ షోలో పాల్గొని ప్రజలుకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరించారు. నైస్ రోడ్డు జంక్షన్, సుమ్మనహళ్లి, బ్యాడరహళ్లి, సుంకదకట్ట రోడ్డులో మోదీ కోసం వేలాది మంది ప్రజలు రోడ్లకు ఇరువైపు బారులు తీరారు. నైస్ రోడ్ పరిసర ప్రాంతాలు జనసాగరంతో నిండిపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులు ఫుల్ హ్యాపీ అయ్యారు.
బెంగళూరు నగరంలోని అన్ని నియోజక వర్గాల బీజేపీ అభ్యర్థుల తరపున ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేసి మన పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాని బెంగళూరు ప్రజలకు మనవి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో సందర్బంగా బెంగళూరు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు మొదట మూడు వేల మంది పోలీసులను నియమించాలని పోలీసు అధికారులు అనుకున్నారు. అయితే చివరి క్షణంలో బందోబస్తుకు ఏర్పాటు చేసిన పోలీసుల సంఖ్య పెరిగిపోయింది. నైస్ రోడ్ పరిసర ప్రాంతాలు మోదీ జిందాబాద్ మోదీ జిందాబాద్ అంటూ నినాదాలతో దద్దరిల్లిపోయింది.

ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో పూర్తి అయిన తరువాత భారీ బందోబస్తుతో ప్రత్యేక వాహనంలో సుమ్మనహళ్లి నుంచి నేరుగా విధాన సౌధ సమీపంలోని రాజ్ భవన్ కు వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి అనుమతి ఉన్న నాయకులను మాత్రమే రాజ్ భవన్ లోకి అనుమతి ఇస్తున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కోలారు. మైసూరు, రామనగర జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications