బెంగళూరులో దారుణం: క్లాస్‌రూంలో ప్రిన్సిపల్ హత్య

బెంగళూరులో దారుణం చోటుచూసుకుంది. ఓ స్కూలు ప్రిన్సిపాల్‌ను ఆరుగురు గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. వివరాల్లోకి వెళితే...అగ్రహార దాసరహళ్లిలో హవనూర్ పబ్లిక్ స్కూల్‌ ప్రిన్సిపాల్ రంగనాథ్ పిల్లలకు క్లాస్ తీసుకుంటుండగా ఒక్కసారిగా దుండగులు క్లాస్ రూంలోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో క్లాసులో మొత్తం 20మంది 10వ తరగతి విద్యార్థులున్నారు. ఇక వారికి పాఠాలు చెబుతున్నసమయంలో కారులో వచ్చిన దుండగులు చేతిలో కత్తులు కటార్లతో క్లాస్‌రూంలోకి ప్రవేశించారు. ఎవరు మీరు అనేలోపే ప్రిన్సిపాల్‌పై కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడికే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని చూసిన పిల్లలు షాక్‌కు గురయ్యారు.

ప్రిన్సిపాల్ రంగనాథ్‌ను కత్తితో నరికిన దుండగులు ఆ తర్వాత వచ్చిన కారులోనే పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొరికిన ఆధారాలతో ఒక నిందితుడిని గుర్తించారు.మహాలక్ష్మీ లేఔట్‌ ఏరియాలో ఈ నిందితుడిని పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులను చూసిన నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించారు. అలర్ట్ అయిన పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో కాలుకు బుల్లెట్ తగిలింది. బుల్లెట్ తగలడంతో నిందితుడు ఎక్కువ దూరం పారిపోలేకపోయాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో అక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు.

Principal killed in classroom in Bengaluru

ఇదిలా ఉంటే ఈ హత్యకు కారణం భూవివాదమే అని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టపగలు విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా ప్రిన్సిపాల్ హత్యకు గురికావడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+