ఊహాగానాలే, రాజకీయాల్లోకి రాను: ప్రియాంక గాంధీ

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు పలు సందర్భాల్లో ఊహాగానాలు చెలరేగుతున్నాయని, వాటిలో నిజం లేదని ఆమె చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ విధమైన ఊహాగానాలను ప్రోత్సహించేవారు అటువంటివాటికి దూరంగా ఉంటే తాను ధన్యవాదాలు తెలుపుతానని ఆమె అన్నారు.
ముగ్గురు గాంధీ కుటుంబ సభ్యులు పార్టీలో ప్రధాన నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుందని అంటూ ప్రియాంక గాంధీ విస్తృతమైన పాత్ర పోషించాలని కాంగ్రెసు నాయకులు కోరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బాధ్యతలు తీసుకుంటారని మీడియాలో వార్తలు వచ్చాయి.
గాంధీ కుటుంబ సభ్యులంతా పార్టీ కీలక బాధ్యతలు చేపట్టాలని, భారతదేశ ప్రజలు ముగ్గురు గాంధీ కుటుంబ సభ్యులు కూడా నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారని పార్టీ అధికార ప్రతినిధి శోభ ఓజా అన్నారు.












Click it and Unblock the Notifications