• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్టార్ ప్రొడ్యూసర్ కుమార్తెకు కరోనా పాజిటివ్‌:ప్రియుడితో డేటింగ్: ఆస్ట్రేలియాలో టూర్:వైరస్ బారిన..

|

ముంబై: బాలీవుడ్‌కు చెందిన స్టార్ ప్రొడ్యూసర్ కరీం మొరాని కుమార్తె షాజా మొరాని ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. కొద్దిరోజులుగా అస్వస్థతగా ఉంటోన్న ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలను నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. బాలీవుడ్‌కే చెందిన కనికా కపూర్ ఇప్పటికే ఈ వైరస్ బారిన పడ్డారు. చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో మరో సెలెబ్రిటీకి వైరస్ సోకడంతో బాలీవుడ్‌లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.

మోడీ ఫార్ములాను ఫాలో అవుతోన్న వైసీపీ ఎమ్మెల్యే:పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ:కాళ్లు కడిగి,పూలుచల్లి

 చెన్నై ఎక్స్‌ప్రెస్ నిర్మాతగా..

చెన్నై ఎక్స్‌ప్రెస్ నిర్మాతగా..

కరీం మొరానికి స్టార్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు ఉంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు. బాక్సాఫీస్‌ను షేక్ చేసి పడేసిన చెన్నై ఎక్స్‌ప్రెస్ నిర్మాతల్లో ఆయనా ఒకరు. రోహిత్ షెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ రాయ్ కపూర్‌లతో కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. అంతకుముందు కొన్ని హిట్ సినిమాలను ఆయన అందించారు. కరీం మొరానికి ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె షాజా. కరీం మొరాని తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న షగున్ బిల్డింగ్‌లో నివసిస్తున్నారు.

ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వెంటనే అనారోగ్యానికి..

ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వెంటనే అనారోగ్యానికి..

కిందటి నెల షాజా మొరాని ఆస్ట్రేలియా నుంచి ముంబైకి వచ్చారు. అనంతరం అస్వస్థతకు గురయ్యారు. ఇంటి వద్దే వైద్యం చేయించుకున్నప్పటికీ.. పెద్దగా ఫలితం రాలేదు. దీనితో కుటుంబ సభ్యులు ఆమెను విల్లే పార్లే ప్రాంతంలోని డాక్టర్ బాలాభాయ్ నవరాత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలను నిర్వహించిన డాక్టర్లు.. ఆమెకు వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కరీం మొరాని ధృవీకరించినట్లు మహారాష్ట్ర మీడియా వెల్లడించింది.

ప్రియాంక్ శర్మతో డేటింగ్..

ప్రియాంక్ శర్మతో డేటింగ్..

షాజా మొరాని కొద్దిరోజులుగా ప్రియాంక్ శర్మతో డేటింగ్‌లో ఉంటున్నారు. 80వ దశకంలో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన టాప్ హీరోయిన్ పద్మినీ కొల్హాపురి కుమారుడే ఈ ప్రియాంక్ శర్మ. న్యూయార్క్‌లోని ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకుంటున్న సందర్భంగా ప్రియాంక్ శర్మతో షాజా మొరానికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియాంక్ శర్మతో కలిసి ఆస్ట్రేలియాలో పర్యటించి వచ్చారని బాలీవుడ్ చెబుతోంది.

 కనికా కపూర్.. తరువాత

కనికా కపూర్.. తరువాత

బాలీవుడ్‌కే చెందిన కనికా కపూర్ ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడ్డార. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో చికిత్స పొందుతున్నారు. కనికా కపూర్ తరువాత బాలీవుడ్‌కే చెందిన మరో సెలెబ్రిటీ కరోనా వైరస్ బారిన పడటం ఇది రెండోసారి. కనికా కపూర్‌తో షాజా మొరానికి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇదివరకు వారిద్దరూ చాలాసార్లు కలుసుకున్నారు. తాజాగా కనికా కపూర్‌ ఈ వైరస్ బారి నుంచి బయటపడ్డారు. ఆమెకు ఏడోసారి నిర్వహించిన రక్త పరీక్షల సందర్భంగా వైరస్ లేదని నిర్ధారితమైంది.

English summary
It is reported that Shaja, who lives in a building named Shagun in Juhu area of ​​Mumbai, has been admitted to Nanavati Hospital on Sunday (April 5) night. It is being told that she returned to Mumbai from Australia a few days ago. At the moment, there is no news about when she returned from Australia and whom she met after returning to Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more