తెలంగాణ అమ్మాయిలు, మైసూరు హోమ్ స్టే లో హైటెక్ వేశ్యవాటిక !
తెలంగాణ రాష్ట్రం నుంచి అందమైన అమ్మాయిలను తీసుకు వచ్చి హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మైసూరు: తెలంగాణ రాష్ట్రం నుంచి అందమైన అమ్మాయిలను తీసుకు వచ్చి హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణకు చెందిన 8 మంది యువతులను రక్షించి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించామని పోలీసులు అన్నారు.
కర్ణాటకలోని హాసన్ కు చెందిన జగదీష్, సిద్దేష్, మల్లేష్, ఉమేష్ నాయక్, కుమారస్వామి, రజాక్, సాయికుమార్ అనే నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. హిరియపట్టణ - కోప్ప మార్గంలోని గిరుగూరు గ్రామం సమీపంలోని హోం స్టేలో హైటెక్ వేశ్యవాటికా కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.

కచ్చితమైన వివరాలు తెలుసుకున్న పోలీసులు హోం స్టే మీద దాడి చెయ్యడంతో అసలు విషయం వెలుగు చూసింది. మల్లేష్, సాయికుమార్ తెలంగాణ నుంచి అందమైన అమ్మాయిలను తీసుకు వచ్చి ఇక్కడ హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.
తాము దాడి చేసే సమయంలో హోం స్టే వ్యవస్థాపకుడు వసంత్ తప్పించుకుని పారిపోయాడని, అరెస్టు చేసిన నిందితులను అందరిని కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. తెలంగాణకు చెందిన అమ్మాయిల కుటుం సభ్యులకు సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications