వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బనారస్ యూనివర్శిటీ: విద్యార్థినిపై లైంగిక వేధింపులు, లాఠీచార్జీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

వారణాసి: బనారస్ హిందూ యూనివర్శిటీలో విద్యార్థిని లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఈ ఘటనపై విద్యార్ధుల ఆందోళన హింసాత్మకంగా మారింది.

లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రఖ్యాత బనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)ను కుదిపేస్తున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థినిపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సహచర విద్యార్థినులు చేపట్టిన ఆందోళన.. శనివారం రాత్రి హింసాత్మకంగా మారింది. శనివారం రాత్రి క్యాంపస్‌ గేటు వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థినులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

ఈ ఆందోళనల నేపథ్యంలో కొందరు దుండగులు ప్రజా ఆస్తులను తగలబెట్టి.. రాళ్లు విసరడంతో రంగంలోకి దిగిన పోలీసులు, పారామిలిటరీ బలగాలు విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించారు.

Protests Against Harassment Take Violent Turn at Banaras Hindu University, Police Lathicharge Girls

ఆందోళన చేస్తున్న విద్యార్థినులపై లాఠీఛార్జీ చేశారు. బాలికల హాస్టల్‌లోకి ప్రవేశించి మరీ వారిని కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. విద్యార్థినులపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

యూనివర్సిటీలో విద్యార్థినులకు భద్రత లేకపోవడం, తరచూ లైంగిక వేధింపులు ఎదురవుతుండటంతో శుక్రవారం నుంచి విద్యార్థినులు ఆందోళనలు చేస్తున్నారు. క్యాంపస్‌ గేటు ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

ప్రధాని నరేంద్రమోదీ శనివారం వారణాసి పర్యటనకు వచ్చినా.. విద్యార్థినులు తమ ఆందోళనను విరమించలేదు. ప్రధాని యూనివర్సిటీకి వస్తే ఆయన దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలని భావించారు.

English summary
Protests over an alleged molestation case of a first year student at Banaras Hindu University (BHU) turned violent on Saturday night with police resorting to lathicharge to disperse the crowd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X