దారుణం: మహిళా రిటైర్డ్ ఎస్ఐపై సామూహిక అత్యాచారం
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ మహిళా ఎస్సైపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌లో చోటు చేసుకుంది.
రైల్వే పోలీసు ఎస్సైగా పనిచేసి రిటైరైన మహిళా అధికారి(50) జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అమె ఫిరోజ్‌పూర్‌లో చిక్కుకుపోయారు. స్థానిక జీఆర్పీ పోలీసుల సాయంతో షెల్టర్ హోంలో ఆశ్రయం పొందుతున్నారు.

ఈ క్రమంలో ఆమెపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణానికి తెగబడ్డారు. మే 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫిరోజ్‌పూర్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే ఉద్యోగి అయిన ఆమె భర్త మరణించడంతో ఆమెకు జీఆర్పీలో ఉద్యోగం వచ్చినట్లు సమాచారం. కాగా, సబ్ ఇన్‌స్పెక్టర్ హోదాలో ఆమె సర్వీస్ నుంచి రిటైర్ అయినట్లు తెలిసింది.
ఇటీవలే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీస్ ఆఫీసర్ చేయి నరికేసిన ఘటన మరువక ముందే పంజాబ్ రాష్ట్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడం విచారకరం.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications