ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. నలుగురు అక్కాచెల్లెళ్లు.. ఒకే రోజున, ఒకే వేదికపై... ఒక్కటి...
వారు కవలలు. క్వించుపులెట్స్. అంటే ఐదుగురు కవలలు. వీరిలో నలుగురు అక్కాచెల్లెళ్లు, ఓ సోదరుడు ఉన్నారు. 24 ఏళ్ల క్రితం రమాదేవి దంపతులకు జన్మించారు. కవలలు అంటేనే కష్టం.. అందులో ఐదుగురు కవలలు.. అందులో నలుగురు అమ్మాయిలు ఉండటంతో పోషణ భారమైంది. కానీ దానిని ఇష్టంగా మలచుకొన్నారు. ఏదీ కొన్న నలుగురు అక్కాచెల్లెళ్లకు సమానంగా ఉండేటట్టు చూసుకొన్నారు. ఇప్పుడు వారు పెళ్లీడుకొచ్చారు. వివాహం కూడా ఒకే సమయంలో చేయాలని తల్లి రమాదేవి ఆశించారు. అందుకు ఈశ్వరుడు కూడా కరుణించారు.

క్వించుపులెట్స్..
కేరళలోని తిరువనంతపురానికి చెందిన ప్రేమ్ కుమార్-రమాదేవి దంపతులుకు 1995లో సంతానం కలిగింది. ప్రేమ్‌కుమార్ సాధారణ వర్తక వ్యాపారి. అయితే వారికి ఐదుగురు కవల పిల్లలు జన్మించడం విశేషం. వారిని చూసి దంపతుల ఆనందానికి అవధి లేకుండా పోయింది. దీంతో తన ఇంటి ముందు ఉన్న నేమ్ బోర్డును పంచ రత్న (ఐదు వజ్రాలు) అని మార్చారు.

ఏం చేసినా సంచలనమే..
ఉన్నంతలో వారిని పెంచి, పెద్ద చేశారు. ఈ విషయం మీడియాకు తెలిసి కవలల గురించి ప్రపంచానికి చూపించారు. ఇక అప్పటినుంచి కవలలు ఏం చేసినా సంచలనమే. వారి స్కూల్ ఒక్కటే. కానీ వారికి దుస్తులు కొనుగోలు చేసే విషయంలో ప్రేమ్‌కుమార్ చాలా ఇబ్బంది పడేవారు. అయితే ఆ ఇబ్బంది కూడా కూతుళ్ల విషయంలో పెద్దగా పట్టించుకునేవారు కాదని అతని భార్య రమాదేవి తెలిపారు.

కవలల వృత్తి..
ఉత్రాజా, ఉతారా, ఉతామా, ఉత్రా అక్కాచెల్లెళ్లు, ఉత్రాజన్ అనే సోదరుడు ప్రయోజకులు అయ్యారు. ఉత్రాజా, ఉతామా ఇద్దరు అనస్థిషీయా టెక్నిషీయన్స్ అయ్యారు. ఉతారా మాత్రం ఫ్యాషన్ డిజైనర్ రంగాన్ని ఎంచుకున్నారు ఉత్రా ఆన్‌లైన్ జర్నలిజాన్ని ఎంచుకోగా.. వారి సోదరుడు ఐటీ ప్రెఫెషనల్ రంగాన్ని ఎంచుకొన్నారు. వీరంతా తమ తమ విభాగాల్లో రాణిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.

నిరంతర శ్రమ
వీరు ఈ స్థాయికి వచ్చేందుకు ప్రేమ్‌కుమార్ అహోరాత్రులు శ్రమించారు. తమ పిల్లల బంగారు భవిష్యత్ కోసం కృషిచేశారు. కానీ 2004లో ప్రేమ్‌కుమార్ మృతి ఆ కుటుంబాన్ని కలచివేసింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబభారం భార్య రమాదేవిపై పడింది. ఆమె చిన్న కో ఆపరేటివ్ బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నారు.

పిల్లల పెళ్లిపై..
రమాదేవి హార్ట్ పేషెంట్.. ఫేస్ మేకర్ సాయంతో ఆమె కాలం వెళ్లదీస్తోంది. తమ పిల్లలు పెద్ద వాళ్లు కావడంతో పెళ్లి చేద్దామని రమాదేవి అనుకొన్నారు. అయితే కవలలు అందరికీ ఒకేసారి మ్యారేజ్ చేయాలని భావించారు. ఆమె కృపకు భగవంతుడు కూడా కరుణించాడు.

ఒకేసారి పెళ్లి...
నలుగురు కవలలకు పెళ్లి సంబంధాలు కుదిరాయి. అబ్బాయికి మాత్రం ఓకే కాలేదు. ఒకే రోజు పెళ్లి చేసేందుకు ఆ కుటుంబాలు కూడా అంగీకరించాయి. ఏప్రిల్ 26వ తేదీన గురువాయుర్ శ్రీ కృష్ణ ఆలయంలో నలుగురికి ఒకే వేదికపై పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. కవల కూతుళ్ల పెళ్లి విషయాన్ని రమాదేవి మీడియాకు వివరించారు. తమ చిరకాల కోరిక నెరవేరబోతుందని రమాదేవి ఆనందంగా తెలిపారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications