వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాధిక ఆస్తులు: మాజీ సిఎం కుమారస్వామికి స్పాట్

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూర్: జెడి (ఎస్) నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి చిక్కుల్లో పడ్డారు. శాసనసభా సభ్యుడిగా కుమారస్వామిని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బెంగళూర్‌కు చెందిన ఓ జర్నలిస్టు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తన రెండో భార్య రాధికా కుమారస్వామి అస్తులను కుమార స్వామి వెల్లడించలేదని ఆ జర్నలిస్టు ఆరోపించారు.

Radhika assets: H.D. Kumaraswamy in a spot

నాగలక్ష్మీబాయి అనే జర్నలిస్టు సోమవారం కుమారస్వామిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 2013 శాసనసభ ఎన్నికల సమయంలో రామనగర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కుమార స్వామి తన రెండో భార్య రాధిక ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించలేదని జర్నలిస్టు ఆరోపించారు.

సినీ నటి రాధికను హెచ్‌డి కుమారస్వామి వివాహం చేసుకున్నాడని, ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారని, అయినప్పటికీ ఆమె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో చెప్పలేదని నాగలక్ష్మిబాయి అన్నారు. అందువల్ల శాసనసభ్యుడిగా కుమారస్వామిని అనర్హుడిగా ప్రకటించాలని నాగలక్ష్మి ఎన్నికల కమిషన్‌ను కోరారు.

కుమారస్వామి రాధిక కూతురు జన్మదిన వేడకలకు హాజరయ్యారని, అయినా రెండో భార్య అస్తుల వివరాలను వెల్లడించడంలో కుమారస్వామి విఫలమయ్యారని నాగలక్ష్మి ఆరోపించారు.

English summary
A Banagalore-based journalist has filed a complaint with the Election Commission of India seeking the disqualification of former chief minister and JD(S) leader H.D. Kumaraswamy from the membership of the assembly for not disclosing the assets and liabilities of his second wife Radhika Kumaraswamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X