• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రఫెల్ రహస్యం శత్రువులకు చేరింది ? సమాచారం ఆధారంగానే పిటిషన్.. కేంద్రం అఫిడవిట్, నేడు విచారణ

|

న్యూఢిల్లీ : రఫెల్ యుద్ధ విమానాల ఒప్పంద పత్రాల రహస్యం శత్రువులకు చేరిందా ? వారికి చేరిన సమాచారం ఆధారంగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారా ? అంటే ఔననే అంటోంది కేంద్ర రక్షణశాఖ. ఈ మేరకు నిన్న సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్ జాబితా తర్వాతే టీఆర్ఎస్ .. ఎందుకంటే, ఇదీ కేసీఆర్ స్ట్రాటజీ

శత్రువులకు చేరిన సమాచారం ?

శత్రువులకు చేరిన సమాచారం ?

రఫెల్ ఒప్పంద పత్రాలు బహిర్గతమవడం దేశ భద్రతకు ప్రమాదంలోకి నెట్టిందని రక్షణశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. పేపర్ కాపీ తీసి దొంగతనానికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేసింది. భద్రతా బలగాల పోరాట సామర్థ్యానికి సంబంధించిన సమాచారం విసృతంగా వ్యాపించి శత్రువుకు చేరిందని రక్షణశాఖ ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఇంటర్నల్ ఎంక్వైరీ ప్రారంభమైందని .. లీకేజీ ఎక్కడ జరిగిందో కనుక్కోవడంపై ఫోకస్ చేశామని కోర్టుకు అఫిడవిట్ లో తెలిపింది. ఫ్రాన్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం అంతా సవ్యంగా ఉందని ఇదివరకే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దానిని సమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్ వేసిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే బుధవారం రక్షణశాఖ అఫిడవిట్ దాఖలుచేసింది .. అఫిడవిట్ ను గురువారం సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.

తూచ్ .. కాదు కాదు

తూచ్ .. కాదు కాదు

చోరీకి గురైన పత్రాల ఆధారంగానే రివ్యూ పిటిషన్లు వేశారని ఇదివరకే సుప్రీంకోర్టు దృఫ్టికి అటార్న జనరల్ కేకే వేణుగోపాల్ తీసుకెళ్లారు. మార్చి 6న ఈ విధంగా చెప్పి .. రెండురోజుల తర్వాత మామటమార్చి .. పత్రాలు చోరీకి గురికాలేదని, వాటి నకళ్లనే పిటిషన్లు ఉపయోగించారని తెలిపారు. ఈ క్రమంలోనే రక్షణశాఖ శాఖ వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన గోప్యతను కేంద్రం కాపాడుతున్నా .. యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, ప్రశాంత్ భూషణ్ సమచారాన్ని బహిర్గతం చేసి .. ఒప్పంద నిబందనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంది.

నేరమూ-శిక్ష

నేరమూ-శిక్ష

అనధికారికంగా పత్రాల నకళ్లు తీసినవారు ఐపీసీ చట్టం ప్రకారం దోషులేనని కేంద్రం స్పష్టంచేసింది. ఒప్పంద పత్రాలకు సంబంధించి లీకేజీ ఎక్కడ జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా స్పష్టంచేసింది. అక్రమంగా సేకరించి సమర్పించిన పత్రాలను కోర్టు రికార్డుల నుంచి తొలగించాలని విన్నవించింది. కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ, అనుమతి లేనిదే ఆ సమాచారాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద బహిర్గతం చేయొద్దని కోరింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Defense ministry Department has expressed concern that the exposure of Rafael contract documents to the country's security threatened. The paper has been suspicious of copying and stealing. The Defense ministry has claimed that the information related to the capacity of the security forces has been widespread and has reached the enemy. The internal inquiry was initiated on the matter and the affidavit told the court that the leak was focused on finding out where the occurred.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more