రఫెల్ యుద్ద విమానం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు
ఎన్నికల ముందు రఫెల్ యుద్ద విమానాల ఒప్పందం కాంగ్రెస్ బీజేపీ మధ్య దుమారాన్ని రేపాయి.రఫెల్ ఒప్పందాన్నే ఆయుధంగా చేసుకుని ప్రధాని నరేంద్రమోడీ పైన అనేక విమర్శలు చెలరాగాయి. కాంగ్రెస్ పార్టీ రఫెల్ డీల్ పై పార్లమెంట్‌ను కూడ స్థంభింపచేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బోఫోర్స్ కుంభకోణాన్ని మరోసారి బయటకు తీశాడు. ఈ కుంభకోణంలో రాజీవ్ గాంధీకి
అవినీతీ మరకలు అంటగట్టాడు. దీంతో ఈ వివాదానికి మరింత దుమారం చెలరేగింది.

అయితే ఇంత పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన రఫెల్ యుద్ద విమానం నమునా ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాయలం ముందు వెలిసింది. కాని మీరు భావిస్తున్నట్టుగా అది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందయితే కాదు. రఫెల్ నమూనాను భారత ఎయిర్ చీఫ్ బీఎస్ ధనోవా అధికారికి నివాసం ముందు దర్శనమిస్తుంది. కాగా ధనోవా నివాసం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎదురుగా ఉంటుంది. దీంతో అది యాదృచ్చికంగానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు దర్శనమిస్తుది.
దీంతో ఆ వాటి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా గతంలో కూడ ఇదే స్థానంలో సుఖోయ్ యుద్దవిమానం కూడ
ఉంచారు.












Click it and Unblock the Notifications