వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణం, గైర్వాజరైన ప్రధాని మోడీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ పదో ముఖ్యమంత్రిగా రఘవర్ దాస్‌తో గవర్నర్ సయద్ అహ్మాద్ ప్రమాణం చేయించారు. జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రులుగా చంద్రప్రకాశ్ చౌదరి, లాయిస్ మరాండీ, చంద్రేశ్వర్ ప్రకాశ్ సింగ్, నిల్కింత్ సింగ్ ముండా ప్రమాణం చేశారు.

రాంచీలోని బిర్సాముండా పుట్‌బాల్ మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

భారీ పొగమంచు కారణంగా జార్ఖండ్ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లలేకపోయిన ప్రధాని నరేంద్రమోడీ ట్వట్టర్ ద్వారా రఘవర్ దాస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన వారిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, మధ్యప్రదేస్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు ఉన్నారు.

గతంలో జార్ఖండ్‌లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా రఘవర్ దాస్ ఉన్నారు. జంషెడ్ పూర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న ఆయన మొన్నటి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్ధి ఆనంద్ బీహారీ దుబేపై 70,157 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గతంలో జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

2000వ కొత్త రాష్ట్రంగా అవతరించిన జార్ఖండ్‌కు ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేయగా... ఐదుగురు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. వీరిలో బాబూలాల్ మారండి, అర్జున్ ముండా, శిబూ సోరెన్, మధు కోడా, హెమంత్ సోరెన్‌లు ఉన్నారు. వీరంతా కూడా గిరిజన నేతలు కావడం విశేషం.

 జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణం

జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణం

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ పదో ముఖ్యమంత్రిగా రఘవర్ దాస్‌తో గవర్నర్ సయద్ అహ్మాద్ ప్రమాణం చేయించారు.

 జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణం

జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణం

జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రులుగా చంద్రప్రకాశ్ చౌదరి, లాయిస్ మరాండీ, చంద్రేశ్వర్ ప్రకాశ్ సింగ్, నిల్కింత్ సింగ్ ముండా ప్రమాణం చేశారు.

 జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణం

జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణం

భారీ పొగమంచు కారణంగా జార్ఖండ్ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లలేకపోయిన ప్రధాని నరేంద్రమోడీ ట్వట్టర్ ద్వారా రఘవర్ దాస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన వారిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, మధ్యప్రదేస్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు ఉన్నారు.

 జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణం

జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణం

రాంచీలోని బిర్సాముండా పుట్‌బాల్ మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

చత్తీస్‌గఢ్‌కు చెందిన రఘువర్ దాస్ జార్ఖండ్ లోనే స్థిరపడ్డారు. టాటా స్టీల్ మాజీ ఉద్యోగి. 1995 నుంచి జంషెడ్ పూర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్ధానాలు ఉండగా, బీజేపీ మిత్ర పక్షాలకు 42 స్ధానాలు కైవసం చేసుకుని జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

ఢిల్లీలో భారీ పొగమంచు కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ జార్ఖండ్ పర్యటన అర్ధాంతరంగా రద్దైంది. ఆదివారం ఉదయం జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకావాల్సి ఉంది. అయితే పొగమంచు కారణంగా ప్రధాని పర్యటన రద్దైనట్లు అధికారులు ప్రకటించారు.

English summary
Jharkhand, which has seen nine governments in the last 14 years, has created history. Five time BJP MLA, Raghubar Das, on Sunday took oath as the first non-tribal chief minister of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X