రాహుల్‌కు చేదు: మోడీ-మోడీ అంటూ నినాదాలు(వీడియో)

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత ప్రొఫెషనల్ బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్ ఆడిన తొలి ప్రొఫెష‌నల్‌ బౌట్‌ను చూడ‌టానికి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీకి చేదు అనుభ‌వం ఎదురైంది. ఆయ‌నను చూడగానే స్టేడియంలోని కొంత‌మంది ప్రేక్ష‌కులు హేళ‌నగా వ్యవహరించారు.

Rahul Gandhi booed, crowd chants 'Modi-Modi' during Vijender's title clash

మోడీ, మోడీ అంటూ ప్ర‌ధాని జపం చేయ‌డంతో రాహుల్ కాస్త ఇబ్బందిపడ్డారు. గ్రే టీష‌ర్ట్‌, డెనిమ్స్ వేసుకొని మ్యాచ్ చూడ‌టానికి వ‌చ్చారు 46ఏళ్ల రాహుల్‌గాంధీ. ఐపీఎల్ చైర్మ‌న్ రాజీవ్‌శుక్లా ప‌క్క‌న కూర్చొని బౌట్ చూశారు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత రాహుల్‌ స్టేడియం నుంచి బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యంలోనూ ప్రేక్ష‌కులు ఇలాగే నినాదాలు చేశారు.

ఆయ‌న మాత్రం ఎప్ప‌టిలాగే న‌వ్వుతూ వారి వంక చూసి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఈ బౌట్‌కు రాహుల్‌తోపాటు బాక్స‌ర్ మేరీకోమ్‌, రెజ్ల‌ర్ యోగేశ్వ‌ర్ ద‌త్‌, క్రికెట‌ర్లు సెహ్వాగ్‌, యువ‌రాజ్‌, సురేష్ రైనా, న‌టుడు ర‌ణ్‌దీప్ హుడా కూడా ప్రత్యక్షంగా వీక్షించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress vice-president Rahul Gandhi was booed by the crowd at the Thyagaraj stadium where he had come to watch Vijender Singh’s WBO Asia Pacific Super Middleweight Championship title bout here last night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి