25 లక్షల ఓట్ల చోరీ: 'హెచ్-ఫైల్స్' పేరుతో రాహుల్ హైడ్రోజన్ బాంబ్!
Rahul Gandhi: ఎన్నికలలో జరిగిన అవకతవకలు, ఓట్ల చోరీ అంశంపై ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలతో కూడిన పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ 'హెచ్-ఫైల్స్ (H-Files)' అని పేరు పెట్టింది. బీహార్‌లో తొలి దశ పోలింగ్‌కు కేవలం ఒక రోజు ముందు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి "హైడ్రోజన్ బాంబ్ లోడింగ్" అంటూ పోస్ట్ చేయడం ఉత్కంఠ రేపింది.
రాహుల్ గాంధీ చేసిన ప్రధాన ఆరోపణలు
రాహుల్ గాంధీ ఈ పత్రికా సమావేశంలో ప్రధానంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. దీనికి సంబంధించి పలు లెక్కలను విడుదల చేశారు.
25 లక్షల ఓట్ల చోరీ
హర్యానాలో మొత్తం ఓటర్లు 2 కోట్లు కాగా, 25 లక్షల ఓట్లు చోరీ జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంటే హర్యానాలోని ప్రతి 8 మంది ఓటర్లలో ఒకరు ఫేక్ అని ఆయన వివరించారు. ఈ కారణంగానే కాంగ్రెస్ ఓడిపోయిందని ఆయన అన్నారు. ఈ 25 లక్షల ఓట్ల చోరీ ఐదు వేర్వేరు కేటగిరీలలో జరిగిందని, 5 లక్షల 21 వేలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.

నకిలీ ఓట్లు, ఫోటోల మోసం
ఒకే పోలింగ్ బూత్‌లో ఒకే మహిళ పేరు 223 సార్లు నమోదైందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ మహిళ ఎన్నిసార్లు ఓటు వేశారో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక యువతి ఫోటోను ఉపయోగించి, వేర్వేరు పేర్లతో (సీమా, సరస్వతి వంటి పేర్లతో) 22 చోట్ల ఓట్లు వేసినట్లు ఆరోపణలు చేశారు. "ఈ బ్రెజిలియన్ మహిళ హర్యానా ఓటర్ల జాబితాలో ఎందుకు ఉంది?" అని ప్రశ్నించారు. ఓటరు జాబితాలో నకిలీ ఫోటోలతో ఉన్న ఓటర్లు 1 లక్షా 24 వేల 177 మంది ఉన్నారని, ఒకే మహిళ తొమ్మిది చోట్ల ఓటు వేసిందని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్, అసలు ఓట్ల వ్యత్యాసం
హర్యానా ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్, వాస్తవ ఓట్ల ధోరణి విభిన్నంగా ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లను మాత్రమే పరిగణించినట్లయితే కాంగ్రెస్‌కు 76 సీట్లు, బీజేపీకి కేవలం 17 సీట్లు మాత్రమే లభించేవని ఆయన వివరించారు. పోస్టల్ బ్యాలెట్‌లో, ఎగ్జిట్ పోల్స్‌లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చూపినా, చివరకు కాంగ్రెస్ 22,779 ఓట్ల తేడాతో ఓడిపోయిందని, మొత్తం మీద లక్షకు పైగా ఓట్ల వ్యత్యాసం ఉందని అన్నారు.
సీసీటీవీ ఫుటేజ్ తొలగింపు
ఈ ఓట్ల చోరీకి ఉద్దేశం స్పష్టంగా ఉంది-అది బీజేపీకి సహాయం చేయడమేనని అని రాహుల్ గాంధీ ఆరోపించారు. బూత్‌లో ఏం జరిగిందో బయటపడకుండా ఉండేందుకే సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించారని ఆరోపించారు.
సీఈసీ దేశ ప్రజలకు అబద్ధం చెప్పారు..
'హెచ్-ఫైల్స్' పేరుతో నిర్వహించిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై గణాంకాలతో పాటు, ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీ దేశ ప్రజలకు బహిరంగంగా అబద్ధం చెప్పారని ఆయన ఆరోపించారు. న్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోను ప్రదర్శిస్తూ రాహుల్ గాంధీ ఈ ఆరోపణలు చేశారు. ఇల్లు లేని వ్యక్తుల కోసం (నిరాశ్రయుల కోసం) ఓటర్ల జాబితాలో 'హౌస్ నంబర్ జీరో (0)' నమోదు చేయబడుతుందని సీఈసీ జ్ఞానేష్ కుమార్ గతంలో పేర్కొన్నట్లు రాహుల్ గాంధీ గుర్తు చేశారు. హౌస్ నంబర్ జీరోకు సంబంధించి సీఈసీ ఇచ్చిన సమాచారం వాస్తవం కాదని ఆయన ధ్రువీకరించారు.
బీజేపీతో సంబంధం ఉన్న నకిలీ ఓటర్లు
నకిలీ ఓట్ల అంశంలో బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉదహరిస్తూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. దాల్‌చంద్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోనూ ఓటరుగా, హర్యానాలోనూ ఓటరుగా ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన కుమారుడు కూడా హర్యానాలోనూ, యూపీలోనూ బీజేపీకి ఓటు వేసే విధంగా రెండు చోట్ల ఓటరుగా ఉన్నారని ఆరోపించారు. బీజేపీతో సంబంధం ఉన్న వేలాది మంది ప్రజలు ఈ విధంగా రెండు రాష్ట్రాలలో లేదా అనేక చోట్ల ఓటర్లుగా ఉన్నారని ఆయన తెలిపారు. మథుర సర్పంచ్ అయిన ప్రహ్లాద్ పేరు కూడా హర్యానా ఓటర్ల జాబితాలో చాలా చోట్ల నమోదైందని ఆయన పేర్కొన్నారు.
హర్యానాలో జరిగింది... బీహార్‌లోనూ జరుగుతుంది..
హర్యానాలో జరిగినట్లు బీహార్ లో కూడా జరుగుతుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీహార్‌లో తొలి దశ పోలింగ్‌కు ముందు ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా, ఆ రాష్ట్ర ఓటర్ల జాబితాలో కూడా భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఓటరు జాబితాను తమకు చివరి క్షణంలో మాత్రమే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. టుంబాల పేర్ల తొలగింపు: రాహుల్ గాంధీ పత్రికా సమావేశ వేదికపైకి బీహార్‌కు చెందిన కొందరు ఓటర్లను తీసుకువచ్చారు. వారి పేర్లు ఓటరు జాబితాల నుంచి తొలగించబడ్డాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, మొత్తం కుటుంబాల పేర్లు కూడా ఓటరు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఆయన వివరించారు. ర్యానా మాదిరిగానే బీహార్‌లో కూడా లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని రాహుల్ గాంధీ తెలిపారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications