తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ స్పందన: ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
శ్రీ వేంకటేశ్వరుడు మన దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దైవమని అన్నారు.
లడ్డూ కల్తీ వ్యవహారం ప్రతి భక్తుడిని బాధపెడుతుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలోని పుణ్యక్షేత్రాల పవిత్రతను మనం కాపాడుకోవాలి అని రాహుల్ గాంధీ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతా వేదికగా పేర్కొన్నారు.

కాగా, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ అంటే కోట్లాది మంది భక్తులకు ఎంతో పరమ పవిత్రమైనది. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ కలపడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ వినియోగిస్తున్నట్లుగా ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు-NDDB) నివేదిక తేల్చడం గమనార్హం. దీంతో గత వైసీపీ పాలకులపై విమర్శలు వస్తున్నాయి.
The reports about the defilement of the Prasad at Sri Venkateshwara temple in Tirupati are disturbing.
— Rahul Gandhi (@RahulGandhi) September 20, 2024
Lord Balaji is a revered deity for millions of devotees in India and across the world. This issue will hurt every devotee and needs to be thoroughly looked into.
Authorities…
కేంద్ర ఆరోగ్యశాఖ ఆరా
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ (Tirumala laddoos) ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) తెలిపారు. వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ అంశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications