నిప్పులు చెరిగిన రాహుల్ - ప్రధాని అభ్యంతరం, హోరా హోరీ..!!
ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తొలి ప్రసంగంలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టారు. ఎన్డీయే సర్కారుపై నిప్పులు చెరిగారు. సత్యమేవ జయతే అంటారు... నిజం మాట్లాడితే భయపడతారు అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. హిందువులు హింసను ప్రోత్సహించరని వ్యాఖ్యానించారు. శివుడి ఫొటో ప్రదర్శిస్తూ రాహుల్ చేస్తున్న వ్యాఖ్యల పై ప్రధాని మోదీ అభ్యంతరం వ్యక్తం చేసారు. స్పీకర్ కు రాహుల్ సూచనలు చేసారు.
రాహుల్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వాన్ని తన తొలి ప్రసంగంలోనే రాహుల్ గాంధీ టార్గెట్ చేసారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, అయోధ్య, నీట్, భూసమీకరణ, సైన్యంలో అగ్నివీర్ నియామకాల వంటి అంశాల్లో కేంద్రాన్ని నిలదీసారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, మాట్లాడేందుకు ప్రతిపక్ష సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలని అన్నారు. సత్యమేవ జయతే అంటారు... నిజం మాట్లాడితే భయపడతారు అంటూ ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షాలను వేధించారు
భారతదేశ ఆలోచన, రాజ్యాంగంపై దాడిని అడ్డుకుంటామన్నారు. తాము రక్షణగా నిలబడతామన్నారు. రాజ్యాంగంపై దాడిని అడ్డుకున్న వ్యక్తులపై దాడి జరుగుతోందని ఆరోపించారు. మోదీ పాలనలో చాలామంది ప్రతిపక్ష నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. విపక్ష నేతలను వేధించడం సరికాదన్నారు. అధికారం కంటే నిజం గొప్పదనే విషయం తెలుసుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు తాను సంతోషంగా ఉన్నానని... గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణ, సంపద వికేంద్రీకరణ, పేదలు, దళితులు, మైనార్టీలపై దౌర్జన్యాన్ని ప్రతిఘటించిన వారిని అణచివేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే తనను విచారణ సంస్థలు విచారించాయన్నారు.
అయోధ్య లో ఏం చేసారంటే
ప్రధాని మోదీ కనీసం విపక్ష నేతను మర్యాదపూర్వకంగా అయినా పలకరించరు, ఆయన నుంచి ఒక చిరునవ్వును కూడా ఆశించలేం అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సభలో శివుడి ఫొటో చూపిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యల పైన ప్రధాని అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇక..అయోధ్య రామమందిర సమయంలో కార్పోరేట్ పెద్దలకు మాత్రమే ఆహ్వానం అందిందని ఆరోపించారు. తన ఎంపీ పదవిని, ఇంటిని లాక్కున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలను సీబీఐ, ఈడీలతో బెదిరిస్తున్నారని విమర్శించారు. హిందువులంటే బీజేపీ, ఆరెస్సెస్ మాత్రమే కాదన్నారు. సభలో ఉన్నవారు... బయట ఉన్నవారూ హిందువులేనన్నారు. ప్రధాని మోదీ ఇప్పటి వరకు మణిపూర్‌కు వెళ్లలేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications