పాక్ ఓటములను ప్రశ్నించలేని రాహుల్..భారత్ విజయాలను ప్రశ్నించే హక్కుందా..?
యుద్ధం,దౌత్యం రెండిటిలోనూ అసలు నిజం ఏమిటనేది ఎప్పటికీ బయటకు రాదు.అది తప్పనిసరి పరిస్థితుల్లో బయటపడే ఒప్పుకోలు నుంచి వెలుగు చూస్తుంది. ఆపరేషన్ సిందూర్‌లో 138 మంది సైనికులకు పాకిస్తాన్ శౌర్య పతకాలు ఇవ్వడం అలాంటి ఒక ఒప్పుకోలే.కార్గిల్‌లో తమ పాత్రను ఎప్పుడూ ఒప్పుకోని పాకిస్తాన్..తమ సైనికుల మృతదేహాలను కూడా తిరస్కరించింది.కొన్నేళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న వాదనను పాకిస్తాన్ ఖండిస్తున్నట్లుగానే నటిస్తూ చేయాల్సిందంతా చేస్తోంది. చివరికి భారత్ చెప్పిందే నిజమైంది. భారత సైన్యం ధాటికి పాకిస్తాన్ రక్తమోడిందనేది పచ్చి నిజం.
శౌర్య పతకాలు ఎవరికిస్తారు.. ఎలాంటి ప్రాణత్యాగాలు చేయకుండానే ఇస్తారా..?138 మంది సైనికులకు పతకాలు ఇస్తున్నారంటే, వందల మంది గుర్తింపు లేకుండానే మిగిలిపోయారు. వారి మరణాలను పాక్ ఇక దాచిపెట్టలేదు. కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ చేసిన అతిపెద్ద ఒప్పుకోలు ఇది. కార్గిల్‌లో 453 మంది చనిపోయారని పాక్ అంగీకరించింది, కానీ వాస్తవ సంఖ్య చాలా ఎక్కువ అని భారత్‌కు తెలుసు. తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ 36 గంటల పాటు కొనసాగింది. ఇప్పుడు 138 మంది పాక్ సైనికులకు ఆ దేశం శౌర్య పతకాలు ఇస్తోంది. అంటే కార్గిల్‌తో పోలిస్తే 36 గంటల పాటు జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో కనీసం 500 నుంచి 1000 మంది పాక్ సైనికులు మృతి చెంది ఉంటారు.

రాహుల్ గాంధీ-ఆధారాల రాజకీయాలు
పరాయి దేశంలో ఇలా ఉంటే..భారత్‌లో దీనిపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. భారత బలగాలు 2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ వైమానిక దాడులు నిర్వహిస్తే.. లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం రుజువులు కావాలని డిమాండ్ చేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాదు, భారత ఆర్మీపై అనుమానం వ్యక్తం చేశాడు. ఓ వైపు పాక్ తమ తప్పులేదని చెప్పే ప్రయత్నం చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ భారత్‌లో పాక్ గొంతుకగా నిలుస్తున్నారు.
ఈ శౌర్య పతకాలను పాకిస్తాన్ తమ సైనికులకు ఇవ్వడం ద్వారా ఆపరేషన్ సింధూర్‌లో భారీగా నష్టపోయామని ఒప్పుకుంటున్నట్లే లెక్క.అయితే వీటికి కూడా రాహుల్ గాంధీ రుజువులు సాక్ష్యాలు అడుగుతారా అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. చనిపోయిన పాక్ సైనికుల జాబితా, వారు ఎలా మృతి చెందారో పాకిస్తాన్‌ను రాహుల్ గాంధీ రుజువులు అడుగగలరా.. లేక గతంలోలా మళ్లీ భారత ఆర్మీపై అనుమానం వ్యక్తం చేస్తారా..?
ఎందుకంటే ఈసారి ఆధారాలు ఢిల్లీ నుంచి రాలేదు, ఇస్లామాబాద్ నుంచి వచ్చాయి. పాకిస్తానే ఒప్పుకున్న దాని ప్రకారం.. ఆపరేషన్ సిందూర్‌లో అది ఒప్పుకోలేని దానికంటే ఎక్కువ మంది సైనికులను కోల్పోయింది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, ఒక మలుపు. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు దాని మూల్యం చెల్లించింది. భారతదేశానికి ఇది సైనికపరంగానే కాకుండా, రాజకీయంగా కూడా ఒక లెక్క తేలిన సందర్భం. ఒకవేళ రాహుల్ గాంధీ పాకిస్తాన్ సంఖ్యలను ప్రశ్నించలేకపోతే, భారత విజయాలను ప్రశ్నించడానికి ఆయనకు ఏమాత్రం నైతిక హక్కు లేదు.
పాకిస్తాన్ శౌర్య పతకాల జాబితా ఏం నిర్ధారిస్తోందంటే.. భారత్ చివరికి తన పొరుగు దేశంపై దశాబ్దాల ఉగ్రవాదానికి మూల్యం కట్టించింది. ఇది ఒక ఆపరేషన్ గురించి మాత్రమే కాదు. ముంబైలో జరిగిన 26/11 దాడులకు, 2001 పార్లమెంట్ దాడికి,యూపీఏ హయాంలో నిర్ణయాత్మక చర్యలకు బదులుగా కేవలం సంఖ్యాపరంగా మాత్రమే జారీ అయిన లెక్కలేనన్ని దాడులకు ఇది న్యాయం చేసింది. ఇది కూడా ఒకే పోరాటంలో పాకిస్తాన్ ఒప్పుకున్న అత్యధిక మరణాల సంఖ్య. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ 453 మరణాలను ఒప్పుకోగా, భారత్ ఆ సంఖ్య 4,000కు దగ్గరగా ఉంటుందని అంచనా వేసింది. అదే లాజిక్ ప్రకారం, ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ ఇప్పుడు ఇచ్చిన 138 పతకాలు 500-1,000 మంది వాస్తవ మరణాలను సూచిస్తున్నాయి. కేవలం 36 గంటల చర్యలో భారత బలగాలు అంతటి నష్టాన్ని కలిగించాయి.
వేర్పాటువాదులు,మెతక వైఖరి,యూపీఏ వారసత్వం
కశ్మీర్‌లో దశాబ్దాలుగా హింసను ప్రేరేపించిన వేర్పాటువాది సయ్యద్ అలీ షా గిలానీకి మరణాంతరం పాకిస్తాన్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించిన సమయంలోనే ఈ శౌర్య పతకాల జాబితాను ప్రకటించింది. యూపీఏ హయాంలో గిలానీ ముప్పుతిప్పలు పెట్టాడు. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తికి నాటి యూపీఏ ప్రభుత్వం భద్రతతో పాటు ప్రభుత్వ సదుపాయాలు కల్పించింది. అంతేకాదు గిలానీ పట్ల మెతక వైఖరిని ప్రదర్శించింది.ఇప్పుడు, పాకిస్తాన్ అతనికి తన అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలు వేర్పాటువాదాన్ని అణచివేయడానికి బదులుగా ఆ నాయకులను ఎలా నెత్తిన పెట్టుకున్నాయో గుర్తుచేస్తుంది.కానీ మోదీ ప్రభుత్వం అలా కాదు. వేర్పాటు వాదులను, హింసను ప్రోత్సహిస్తూ పాక్‌కు మద్దతుగా నిలిచేవారిపట్ల కఠిన వైఖరితో వ్యవహరిస్తోంది.సరిహద్దుకు అవతల నుంచి ఏ చిన్న సాహసం చేసినా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయాన్ని పాకిస్తాన్‌కు తెలియజెప్పింది. పాకిస్తాన్ కూడా తెలుసుకుంది.
26/11కి, ఆ తర్వాత జరిగిన దాడులకు న్యాయం
26/11 బాధితులకు ఆపరేషన్ సిందూర్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జవాబు. ఆ దాడి పాకిస్తాన్ గడ్డపై సైనిక సహకారంతో ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో జరిగింది. అయినప్పటికీ, యూపీఏ పాలనలో కేవలం దౌత్యపరమైన లేఖలు,అంతర్జాతీయ విజ్ఞప్తులతోనే తన ప్రతిస్పందనను సరిపెట్టింది. పదిహేడు సంవత్సరాల తర్వాత, పాకిస్తాన్ సైన్యం స్వయంగా మూల్యం చెల్లించుకుంది. ఇది కేవలం సైనిక ప్రతీకారం కాదు; ఇది వ్యూహాత్మక న్యాయం. పాకిస్తాన్ ప్రోత్సహించే ఉగ్రవాదంపై కచ్చితమైన సమాధానం ఉంటుందని తెలియజేసే ఒక స్పష్టమైన సందేశం.
వాజ్‌పేయీ హయాంలో కార్గిల్ నుంచి మోడీ హయాంలో ఆపరేషన్ సిందూర్ వరకు.. బలమైన ప్రభుత్వాలు నాయకత్వం వహించినప్పుడు భారతదేశం స్థిరమైన సంకల్పాన్ని చూపించింది. కార్గిల్‌లో, పాకిస్తాన్ తమ సైనికుల సమాధుల కింద తన ఖండనలను పాతిపెట్టింది. ఆపరేషన్ సిందూర్‌లోనూ చరిత్ర పునరావృతమైంది.పాకిస్తాన్ మరోసారి పరోక్షంగా ఒప్పుకోక తప్పలేదు.అయితే,మధ్యలో ఏం జరిగింది? యూపీఏ దశాబ్ద కాలం పాలనలో, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పూణేలలో వరుస ఉగ్రదాడులు జరిగాయి. ప్రతిసారీ, ప్రతిస్పందన దౌత్యపరమైన చర్చలతోనే సరిపెట్టింది.నిస్సహాయ వైఖరికి మాత్రమే పరిమితమైంది. మన శత్రువు ఎప్పుడూ మూల్యం చెల్లించలేదు.ఇప్పుడు తేడా స్పష్టంగా ఉంది.మోడీ నేతృత్వంలోని భారత్ దాయాది దేశానికి గట్టిగా బుద్ధి చెప్తోంది.పాకిస్తాన్ ఈ పరిణామాలను ఎప్పటికీ మర్చిపోకుండా చేస్తోంది.
చివరికి పాకిస్తాన్ మూల్యం చెల్లించింది
కార్గిల్‌లో 453 మంది పాక్ సైనికులు మరణించారని ఆ దేశం ఒప్పుకుంది. వాస్తవానికి ఆ సంఖ్య దాదాపుగా పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారీగా నష్టం వాటిల్లిందని పాక్ పరోక్షంగా ఒప్పుకుంది.138 మంది సైనికులకు శౌర్య పతకాలు అందించిందంటే వాస్తవానికి 500 నుంచి 1000 మంది సైనికులు మరణించి ఉంటారనేది సుస్పష్టం.గత రెండు దశాబ్దాలలో పాకిస్తాన్ ఎదుర్కొన్న అత్యంత భారీ నష్టం ఇదే.
ఇక ఈ ఆధారాలు రాహుల్ గాంధీకి సరిపోతాయా.? లేక ఎంత మంది మృతి చెందారో పాకిస్తాన్ నుంచి లెక్కలు తెప్పించుకునే సాహసం చేస్తారా..? లేదా ఎప్పటిలాగే, భారతదేశ శత్రువుల చేతిని బలపరిచేలా ఆయన సందేహాలను తన సొంత ప్రభుత్వం కోసమే రిజర్వ్ చేసుకుంటారా?
ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక విజయం మాత్రమే కాదు; ఇది ఒక సిద్ధాంతంతో కూడిన మలుపు. నిర్ణయాత్మక నాయకత్వం కింద, భారత్ ప్రతి ఉగ్రవాద చర్యకు మూల్యం వసూలు చేస్తుందని ఇది గుర్తు చేస్తుంది.పాకిస్తాన్ ఎప్పటికీ తన ఖండనల వెనుక దాక్కోలేదని, దాని సొంత ఒప్పుకోలు దాని గాయాలను బయటపెడతాయని ఇది నిరూపిస్తుంది. అయితే, కాంగ్రెస్‌కు ఈ లెక్క తేల్చుకోవడం వేరేలా ఉంటుంది. ఒకప్పుడు భారత విజయాలను ప్రశ్నించిన పార్టీ ఇప్పుడు పాకిస్తాన్ ఓటములను ఎందుకు ప్రశ్నించలేదో వివరించాలి.
మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఒక విషయం స్పష్టం కావాలి.ఆధారాలు పాకిస్తాన్‌ను కూడా అడగాలి, లేదా తన సందేహాలు నిజం కోసం కాదని, కేవలం రాజకీయాల కోసమేనని ఒప్పుకోవాలి. ఎందుకంటే పాకిస్తానే తన నష్టాల స్థాయిని ఒప్పుకుంటే,ఇక చర్చ ముగిసినట్టే. వారిని ఆయన ప్రశ్నించలేకపోతే, భారత విజయాలను ప్రశ్నించడానికి ఆయనకు ఏ మాత్రం నైతిక హక్కు లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications