రైల్వే బడ్జెట్: కొత్తగా ఏమీ లేదని పవన్, ట్విట్టర్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైన విపక్షాలు విమర్శలు గుప్పించాయి. బడ్జెట్లో కొత్తగా ఏదీ కనిపించలేదని మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ అన్నారు. గతంలో బడ్జెట్లకు ఇది కేవలం పొడిగింపుగా ఉందన్నారు.
Rail Budget lays out a clear roadmap to make the Railways the key driver of India's economic growth & playing a key role in India's progress
— Narendra Modi (@narendramodi) February 26, 2015 పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కొత్త రైళ్లపై ప్రకటన
సురేష్ ప్రభు ఈసారి ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులు లేవు. కొత్త రైళ్లు లేవు. దీని పైన విపక్షాలు ప్రశ్నించాయి. కొత్త రైళ్ల పైన ప్రకటన చేయకుండానే ఆయన ప్రసంగం ముగించారు. దీనిపై వివరణ ఇస్తూ పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కొత్త రైళ్లపై ప్రకటన చేస్తామన్నారు.

రైల్వే బడ్జెట్ పైన మోడీ
సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట ముందు చూపుతో, భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ప్రయాణీకుల సౌకర్యం, ఇతర లక్ష్యాలను చేరుకోవడానికి పక్కా ప్రణాళికతో ఈ బడ్జెట్ ఉందని చెప్పారు. మొదటిసారి టెక్నాలజీ, అప్ గ్రెడేషన్, రైల్వేల ఆధునికీకరణకు పెద్దపీట వేసినట్లు మోడీ పేర్కొన్నారు. ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
I am particularly delighted that for the 1st time there is a concrete vision for technology upgradation & modernisation of the Railways.
— Narendra Modi (@narendramodi) February 26, 2015
#RailBudget2015 stands out for its focus on the common man, putting speed, scale, service & safety, all on one track.
— Narendra Modi (@narendramodi) February 26, 2015 -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications