మాటలకందని విషాదం.. 19 మంది సజీవ దహనం..

సంతోషంగా బస్సులో ప్రయాణిస్తున్న వారిని మృత్యువు కబలించింది. మరి కొద్ది సేపట్లో హాయిగా ఇంటికెళ్లాల్సిన ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 19 మంది అభంసుభం తెలియని ప్రయాణికులు మంటల్లో ఆహుతి అయ్యారు. ఘటన సమయంలో బస్సులో 57 మంది ఉన్నారు. మరికొంత పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

రాజస్థాన్ లో మాటలకందని విషాదం జరిగింది. హాయిగా గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఓ ప్రైవేట్ బస్సు జైసల్మేర్‌ నుంచి జోధ్‌ పూర్‌ వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది సజీవదహనం అయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న జవహర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Rajasthan Bus Inferno 19 Lives Lost in Horrific Private Vehicle Blaze

జైసల్మేర్‌ నుంచి జోధ్‌ పూర్‌ కు ఓ ప్రైవేట్ బస్సు మధ్యాహ్నం 3 గంటల సమయంలో బయలుదేరింది. బస్సు ఆర్మీ వార్ మ్యూజియం దాటి దాదాపు 20 కి. మీ దూరం వెళ్లిన తరువాత, ఒక్కసారిగా బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. వెంటనే డ్రైవర్.. ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అప్పటికే 19 మంది సజీవ దహనం అయ్యారు. మరి కొంతమంది కిందకు దూకేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+