ఢిల్లీలో రాజస్థాన్ సీఎం వసుంధర రాజే
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే భేటి అయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం వసుంధర రాజే న్యూ ఢిల్లీ చేరుకున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గోనడానికి ఆమె ఢిల్లీ వెళ్లారు.
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ విదేశాలకు వెల్లడానికి వీలుగా ఇమిగ్రేషన్ పత్రాల మీద వసుంధర రాజే సంతకాలు చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆమె సంతకాలు చేసిన పత్రాలను కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే బయట పెట్టారు.

మొదట తనకు ఏమి తెలియదని చెప్పిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తరువాత ఆ సంతకం తనదేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి వివరణ ఇవ్వనున్నారని తెలిసింది.
ఇప్పటికే వసుంధర రాజేకి బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన తరువాత వసుంధర రాజే సీఎం పదవికి రాజీనామా చెయ్యనవసరం లేదని స్పష్టం చేశారు. ఇదే సందర్బంలో వసుంధర రాజే నరేంద్ర మోడీ, అమిత్ షా లను భేటీ అవుతున్నారు. రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.












Click it and Unblock the Notifications