Rajasthan Polls: సోనియా గాంధీ జైపూర్ టూర్ గెహ్లాట్-పైలట్ రాజీ కోసమేనా ?
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ పార్టీలో అంతర్గత పోరు, రెబెల్స్ వంటి సమస్యలు తప్పడం లేదు. ముఖ్యంగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూ, యువనేత సచిన్ పైలట్ కూ మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న ఆధిపత్య పోరు ప్రభావం ఇప్పుడు ఎన్నికలపైనా పడుతోంది. దీంతో పరిస్ధితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో రాజస్తాన్ రాజధాని జైపూర్ కు మకాం మార్చిన కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ నిన్న రాత్రి అక్కడికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మధ్య పోరు కారణంగా రాజస్తాన్ ఎన్నికల్లో దెబ్బ తప్పదనే అంచనాలతో సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ తో పాటు సచిన్ పైలట్ ను కూడా పిలిపించి ఆమె మాట్లాడతారనే ప్రచారం జరుగుతోంది.

రాజస్తాన్ అసెంబ్లీకి ఈ నెల 25న ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే మరో పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్తాన్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ పలు సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్ నూ గెల్చుకునేందుకు కలిసి కట్టుగా పనిచేసేలా గెహ్లాట్, పైలట్ లను ఒప్పించేందుకు సోనియాగాంధీ ప్రయత్నిస్తారని తెలుస్తోంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం నుండి తప్పించుకోవడానికి గాంధీజీలకు ఈ పర్యటన ప్రైవేట్‌గా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పైకి చెప్తున్నాయి. అయితే సోనియాతో పాటు కుమారుడు రాహుల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.ఈ పర్యటనకు కారణం ఏమిటని వేణుగోపాల్‌ను ప్రశ్నిస్తే.. 'ఇది ప్రైవేట్ విజిట్.. ఢిల్లీలో వాయుకాలుష్యం ఉంది.. అందుకేనని చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ జైపూర్‌లో కూడా పార్టీ సమావేశాలు ఉండవచ్చని సంకేతం ఇచ్చారు. అలాగే రాజస్తాన్ లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications