రాజధాని ఢీ కొని 8 ఏనుగులు మృత్యువాత: పట్టాలు తప్పిన బోగీలు

అస్సాంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఢీ కొని ఎనిమిది ఏనుగులు కన్నుమూశాయి. ఈ ఘటనలో రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్ సహా అయిదో బోగీలు పట్టాలు తప్పాయి గానీ ప్రయాణికులకు ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తోన్నారు.

డీఎన్ సైరాంగ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన నంబర్ 20507 రాజధాని ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. నార్త్ ఫ్రాంటియర్ జోన్ పరిధిలోని లుమ్డింగ్ డివిజన్ జమునాముఖ్- కామ్ పూర్ సెక్షన్ల మధ్య ఈ తెల్లవారు జామున 2:17 నిమిషాలకు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై వెళ్తోన్న ఏనుగుల గుంపును రాజధాని ఎక్స్ ప్రెస్ అతి వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది ఏనుగులు సంఘటన స్థలంలోనే కన్నుమూశాయి.

Rajdhani Express Derails After Collision with Elephant Herd in Assam

రైలింజిన్, దాని వెనుక ఉండే అయిదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రయాణీకులెవరికీ గాయాలు కాలేదు. గువాహటి నుండి 126 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై ఏనుగులను చూసిన వెంటనే రాజధాని ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసినప్పటికీ.. ప్రమాదాన్ని నివారించలేకపోయారు. రైలు వేగంగా ఏనుగులను ఢీ కొట్టింది. రెండు ఏనుగులను కొన్ని మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది.

లోకో పైలెట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడం, ఏనుగుల గుంపును ఢీ కొట్టడంతో తొలుత రైలింజిన్ పట్టాలు తప్పింది. ఆ వెంటనే పెద్ద శబ్దం చేస్తూ అయిదు బోగీలు నేలలోకి దిగబడి పోయాయి. దీంతో కొన్ని మీటర్ల మేర పట్టాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పట్టాలు తప్పడం వల్ల అప్పర్ అసోం, ఈశాన్య ప్రాంతాలకు రైలు సేవలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.

పలు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. ప్రస్తుతం, సాంకేతిక బృందాలు ట్రాక్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్నాయి. ప్రమాదానికి గురైన బోగీలలోని ప్రయాణీకులను తాత్కాలికంగా రైలులోని ఇతర కోచ్‌లకు తరలించారు. దెబ్బతిన్న బోగీలను వేరుచేసిన తర్వాత, రైలును గువాహటి వైపు పంపారు. గువాహటి చేరుకున్నాక అదనపు కోచ్‌లను జోడించిన అనంతరం రాజధాని ఎక్స్‌ప్రెస్ మళ్లీ ఢిల్లీకి బయలుదేరి వెళ్తుందని నార్త్ ఫ్రాంటియర్ రైల్వే ప్రజా సంబంధాల అధికారి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+