రజనీకాంత్ పార్టీ ఇదే: పవన్ కల్యాణ్‌తో జోడీ, దక్షిణాది ఫ్రంట్?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన పార్టీ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దానికి మక్కల్ సేన అనే పేరు పెడుతారని అంటారు. మక్కల్ సేన అంటే జన సేన అని అర్థం

తెలుగు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ పేరు జనసేన. ఒక వ్యూహం ప్రకారమే వారిద్దరు తమ పార్టీ పేర్లను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఉత్తర భారత ఆధిపత్యం కొనసాగుతుందని భావిస్తున్న వారిద్దరు దక్షిణాది ఫ్రంట్ కట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.
హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన పార్టీ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దానికి మక్కల్ సేన అనే పేరు పెడుతారని అంటారు. మక్కల్ సేన అంటే జన సేన అని అర్థం

తెలుగు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ పేరు జనసేన. ఒక వ్యూహం ప్రకారమే వారిద్దరు తమ పార్టీ పేర్లను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఉత్తర భారత ఆధిపత్యం కొనసాగుతుందని భావిస్తున్న వారిద్దరు దక్షిణాది ఫ్రంట్ కట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.

 కర్ణాటకలో ఉపేంద్రతో సై...

కర్ణాటకలో ఉపేంద్రతో సై...

కర్ణాటకలో సినీ నటుడు ఉపేంద్ర రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ పార్టీ కూడా కర్ణాటకలో పోటీ చేస్తుందని భావిస్తున్నారు. కన్నడ మూలాలు ఉన్నాయి కాబట్టి రజనీకాంత్ కర్ణాటక ప్రజలకు సేవ చేసే అవకాశం లేకపోలేదని ఆయన సన్నిహితులు అన్నారు. దీన్ని బట్టి ఆయన ఉపేంద్రతో కలిసి పనిచేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

 ఉత్తరాది ఆధిపత్యంపై పవన్ కల్యాణ్...

ఉత్తరాది ఆధిపత్యంపై పవన్ కల్యాణ్...

రాజకీయాల్లో ఉత్తరాది ఆధిపత్యంపై గతంలో ఓసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ విమర్శలపై బిజెపి నాయకులు తీవ్రంగా ప్రతిస్పందించారు. దక్షిణాదికి సంబంంధించిన ఓ సాంస్కృతిక సంస్థను ఆయన ఏర్పాటు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌కతో ఆయన పనిచేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌తో కలిసి పవన్ కల్యాణ్ దక్షిణాది ఫ్రంట్‌కు ప్రయత్నిస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.

 డిఎంకెను కూడా కలుపుకుంటారా...

డిఎంకెను కూడా కలుపుకుంటారా...

రజనీకాంత్ ఇటీవల డిఎంకె అగ్రనేత కరుణానిధిని కలుసుకుని ఆయన దీవెనలు పొందడం చర్చనీయాంశంగా మారింది. డిఎంకెను కూడా తమతో కలుపుకుని రజనీకాంత్ రాజకీయాలను నడుపుతారా అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది. తమిళనాడు ప్రస్తుత రాజకీయాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం బిజెపి చెప్పుచేతల్లో పనిచేస్తుందనే అభిప్రాయం ఉంది.

 కెసిఆర్‌తో పవన్ కల్యాణ్ భేటీ అందుకేనా...

కెసిఆర్‌తో పవన్ కల్యాణ్ భేటీ అందుకేనా...

ఇటీవల పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావును కలిశారు. ఇందులో దక్షిణాది ఫ్రంట్‌కు సంబంధించిన చర్చలేమైనా జరిగాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు ఎకరానికి 8 వేల రూపాయలు ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కెసిఆర్‌ను అడిగారు. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా చెప్పారు. అందువల్ల తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఆసరా చేసుకుని దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలతో పాగా వేయాలనే వ్యూహం ఏదైనా రూపు దిద్దుకుంటోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

 పవన్ కల్యాణ్‌తో కుమార స్వామి కూడా...

పవన్ కల్యాణ్‌తో కుమార స్వామి కూడా...

గతంలో ఓసారి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి 2016లో పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని ఆయన చెప్పారు. తన కుమారుు నిఖిల్ చిత్రం విడుదల సందర్భంగా ఆశీర్వాదం కోసమే వచ్చానని ఆయన చెప్పారు. ఎపి, కర్ణాటక, తెలంగాణ అన్నదమ్ముల్లాంటివని ఆయన వ్యాఖ్యానించారు. జెడి (యు)తో కలిసి కూడా ఏదైనా దక్షిణాది రాజకీయం నడిచే అవకాశం ఉందా అనే ప్రశ్న కూడా ప్రస్తుతం తెర మీదికి వచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Buz is that Rajinikanth may make allainace with Jana Sena chief Pawan Kalyan in politics.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి