రజినీ ‘సింబల్’ ఆ సంస్థకు తలనొప్పిగా మారింది! ఎలాగంటే?

Subscribe to Oneindia Telugu
  రజనీకాంత్ వెనకడుగు :బాబా ముద్రలో ని తెల్లటి తామరపువ్వు తొలగించడానికి కారణం !

  ముంబై: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటిస్తూ ఆయన చూపిన యోగముద్ర చిహ్నం (బాబా సినిమాలో చూపిన గుర్తు)బాగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. రజినీ పార్టీ గుర్తు కూడా అదేనంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అంతేగాక, రజనీ మద్దతుదారుల నమోదు కోసం ఇటీవల ఆయన 'రజనీకాంత్‌ రసికర్‌ మండ్రం' పేరుతో యాప్‌ను ప్రారంభించారు.

  ఆ యాప్‌ పేరును 'రజనీ మక్కల్‌ మండ్రం'గా మార్చడంతోపాటు, దాని లోగో కూడా రజనీ చూపించిన యోగముద్రే ఉంటుంది. అంతా బాగానే ఉన్నా.. ఆ చిహ్నం తమ కంపెనీ లోగోను కొద్దిగా పోలి ఉంటుందని ముంబైకి చెందిన స్టార్టప్ 'వోక్స్‌‌వెబ్'‌ కొంత ఆందోళనకు గురవుతోంది.

   అదే సమస్య

  అదే సమస్య

  ముంబైలోని స్టార్టప్‌ వోక్స్‌వెబ్‌ ఓ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌. దీన్ని 18 నెలల క్రితం ఏర్పాటు చేశారు. ఆ కంపెనీ లోగో కూడా ఇదే(రజినీ చూపిన గుర్తు) మాదిరిగా ఉంటుంది. ‘వేరే కంపెనీ లేదా బ్రాండ్‌కు ఆ లోగో ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ సోషల్‌మీడియా, రాజకీయ పార్టీకి ఇంచుమించు ఒకే విధంగా ఉండే లోగో ఉంటేనే సమస్యలు వస్తాయి' అని వోక్స్‌వెబ్‌ వ్యవస్థాపకుడు యశ్‌ మిశ్రా అంటున్నారు.

   రజినీకి మద్దిస్తున్నారా? అంటూ..

  రజినీకి మద్దిస్తున్నారా? అంటూ..

  ‘రజనీ చూపించే చిహ్నం, మా కంపెనీ లోగో ఇంచుమించు ఒకేలా ఉంటాయి. కాకపోతే.. మా లోగోలో బొటనవేలు ముడుచుకొని ఉండదు' అని మిశ్రా తెలిపారు. ‘మా కంపెనీ లోగో చూసి ఇప్పటికే కొంతమంది మీరు రజనీకి మద్దతుగా ఉన్నారా అని అడుగుతున్నారు' అని మిశ్రా తెలిపారు. దీనిపై ఇప్పటికే రజనీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు.

   రజినీ పార్టీతో సంబంధం లేదు..

  రజినీ పార్టీతో సంబంధం లేదు..

  అయితే, రజినీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదని మిశ్రా తెలిపారు. రజినీ పార్టీకి తమకు ఎటువంటి సంబంధం లేదని, తాము ఎటువంటి మద్దతు కూడా ఇవ్వడం లేదని మిశ్రా స్పష్టం చేశారు.

  బాబా సినిమాలో

  బాబా సినిమాలో

  కాగా, ‘ఆధ్యాత్మిక రాజకీయ ప్రభుత్వం' ఇదే.. మీకు నా వాగ్దానం అంటూ చూపుడువేలు, చిటికెన వేలును పైకి చూపుతూ...మధ్యరెండువేళ్లనూ మడిచి వాటి చివర్లను బొటనవేలితో తాకుతూ గుండే గుర్తును రజనీకాంత్‌ చూపించారు. అయితే, ఇది 2002లో రజినీ కథానాయకుడిగా వచ్చిన ‘బాబా' చిత్రంలో ఆయన ఇదే యోగముద్ర చిహ్నాన్ని చూపించడం గమనార్హం. ముంబై స్టార్టప్ మాత్రం 18నెలల క్రితమే ఈ (పోలిన)గుర్తుతో తమ సంస్థను ప్రారంభించింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The hand symbol made popular by Rajinikanth has a start up in Mumbai worried. The hand position that the actor-and-would-be politician is known for is often likened to "apana mudra", a yoga finger and palm posture.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X