బిజెపి అధ్యక్షునిగా చెబుతున్నా: టిపై రాజ్‌నాథ్ సింగ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తాము చాలా స్పష్టంగా ఉన్నామని, మొదట్నుంచి తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీనే డబుల్ గేమ్ ఆడుతోందని రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల నేతలను ఉద్యమం చేయాలని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. తాము తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
బిజెపి అధ్యక్షునిగా తమ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నానని, తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నట్లు ఆయన అన్నారు. తెలంగాణ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కోరుతున్నామని, తాము మద్దతు ఇస్తామని, తమ పార్టీ విశ్వసనీయతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
తెలంగాణకు మద్దతు ఇస్తూనే సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications