రజనీకాంత్‌తో పొత్తు అంటే వైఫల్యమే, ఆయన రజనీ పబ్లిసిటీ కార్యకర్త: సుబ్రహ్మణ్యస్వామి
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్‌పై బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి చదువు రాదని, అతనితో పొత్తు పెట్టుకుంటే అంతకంటే పెద్ద నష్టం లేదన్నారు.
సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. అతనికి (రజనీ) చదువు రాదని, సినిమా తారలకు రాజకీయంగా మాస్ ఫాలోయింగ్ రోజులు ఎప్పుడో పోయాయని చెప్పారు. సినిమా తారలతో అలయెన్స్ అంటే అది అతిపెద్ద వైఫల్యమే అన్నారు.

ఎస్ గురుమూర్తిని ఆరెస్సెస్ సిద్ధాంతకర్తగా మీడియా చెబుతుందని, కానీ ఆన ఆరెస్సెస్ వాదిగా చెప్పడం కంటే 'రజనీకాంత్ పబ్లిసిటీ యాక్టివిస్ట్'గా చెప్పడం బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
కాగా, కాలా ఆడియో వేడుక సందర్భంగా రజనీకాంత్ మాటల్లో ఆయన పార్టీకి మరికొంత సమయం తీసుకుంటుందని అర్థమైంది. కాలా ఎన్నో రాజకీయ అంశాలతో కూడిన చిత్రమన్నారు. బాషా, నరసింహలోని ఆంటోనీ, నీలాంబరి పాత్రల్లా ఇందులో హరిదారా పాత్ర ఎంతో సవాల్‌తో కూడుకున్నదన్నారు. దానిని నానా పటేకర్ సమర్థవంతంగా పోషించారన్నారు.












Click it and Unblock the Notifications